Begin typing your search above and press return to search.

వీడియో : హాట్ టాప్ యాంకర్స్‌ ఊరమాస్‌ డాన్స్‌

By:  Tupaki Desk   |   13 July 2021 11:30 AM GMT
వీడియో : హాట్ టాప్ యాంకర్స్‌ ఊరమాస్‌ డాన్స్‌
X
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్స్ రష్మి గౌతమ్‌ మరియు వర్షిణిలు సుపరిచితులు. వీరిలో ఒకరు జబర్దస్త్‌ కామెడీ షో యాంకర్‌ కాగా మరొకరు స్టార్‌ మాలో ప్రసారం అయ్యే కామెడీ స్టార్స్‌ యాంకర్‌. వీరిద్దరికి ఒకే స్టేజ్ పైకి తీసుకు వచ్చాడు ఓంకార్‌. తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్లో వీరి క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే వీరిద్దరు ఓంకార్‌ సిక్త్స్‌ సెన్స్‌ సీజన్‌ 4 లో సందడి చేశారు. ఓంకార్‌ వీరిద్దరితో మస్త్‌ మాస్ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ప్లాన్‌ చేశాడు. వీరిద్దరి కాంబోలో ఈ షో రాబోతున్న నేపథ్యంలో అందరి అంచనాలు భారీగా ఉంటాయి. ఖచ్చితంగా వీరిద్దరు ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందిస్తారని అంతా ఆశిస్తున్నారు.

అంచనాలు తగ్గకుండా షో ఉంటుందని తాజా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. రష్మి కళ్లలోకి ఓంకార్‌ చూస్తూ నువ్వు నవ్వితే మల్లెపూల సునామి.. చూపుల బాణం వదిలితే కుర్రకారు గుండెల్లో యమ్మీ అందుకే మీరు అంటే అందరికి ఇష్టం. ఆ మాటలకు సిగ్గు పడుతూ రష్మి ఎక్స్ ప్రెషన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక రష్మి వేసిన మాస్‌ డాన్స్‌ అదిరి పోయింది. క్లాస్ గా కనిపించే రష్మి అప్పుడప్పుడు వేసే మాస్‌ స్టెప్పుల మాదిరిగానే ఈసారి కూడా ఆమె డాన్స్‌ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఆ తర్వాత రష్మి మరియు వర్షిణిలు ఇద్దరు కూడా మాస్‌ స్టెప్పులతో రెచ్చి పోయారు. ముఖ్యంగా వర్షణి దుమ్ము రేపేలా డాన్స్ చేసింది. ఆమె వేసిన మినీ స్కట్‌ లో థైస్‌ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ చేసిన మాస్ డాన్స్ కు అంతా కూడా ఫిదా అవుతున్నారు. వీరిద్దరు చేసిన మాస్‌ డాన్స్ ల కోసం అయినా ఈ వారం సిక్త్స్‌ సెన్స్‌ చూడాలని అనుకునే వారు చాలా మంది ఉన్నారు.