Begin typing your search above and press return to search.
టాప్- 5 టాలీవుడ్ హీరోయిన్లు OTT అరంగేట్రం
By: Tupaki Desk | 16 Dec 2020 4:00 PM ISTథియేట్రికల్ రిలీజ్ అన్నది ఇటీవల సందిగ్ధంగా మారింది. ఎనిమిది నెలలుగా కోవిడ్ విలయం కొనసాగడంతో సినిమాల రిలీజ్ లు నిలిచిపోయాయి. అదే క్రమంలో ఓటీటీ-బుల్లితెర హవా కొనసాగింది. ఇక ఓటీటీ - డిజిటల్ వేదికలకు ఉన్న భవిష్యత్ దృష్ట్యా స్టార్ల మైండ్ సెట్ కూడా మారింది. పలువురు స్టార్లు వెబ్ సిరీస్ లలో నటించేందుకు కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేసేయడం భారీ కాంట్రాక్టులు కుదుర్చుకోవడం చూస్తున్నదే. ఇందులో ప్రధానంగా ఐదుగురు టాప్ తెలుగు హీరోయిన్లు ఉన్నారు. వీళ్లంతా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పటికే ఆహా వేదికపై సామ్ జామ్ కార్యక్రమాన్ని బిగ్ సక్సెస్ చేయగా.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారనున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
అందాల చందమామ కాజల్ అగర్వాల్.. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’.. తమన్నా నటించిన ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగుకి సిద్ధం కానున్నాయి. `లెవంథ్ అవర్` షోలో తమన్నా ట్రీటివ్వనుంది. లస్ట్ స్టోరీస్ సిరీస్ తో తెలుగమ్మాయి ఇషా రెబ్బా.. మలయాళ బ్యూటీ అమల పాల్ అభిమానులకు ట్రీటిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాధికా ఆప్టే ఇప్పటికే ఓటీటీ స్టార్ గా పాపులర్. అంజలి సహా పలువురు టాప్ హీరోయిన్ల ఓటీటీ ట్రీట్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
థియేటర్లలో అగ్ర హీరోలు నటించే భారీ క్రేజీ సినిమాలకు మాత్రమే జనం పట్టంగడుతున్న వేళ ఇప్పుడు ఓటీటీల్లో హీరోయిన్ల ట్రీట్ తోనే మెజారిటీ జనం సరిపెట్టుకునే ఆలోచన చేస్తారని అంచనా వేస్తున్నారు. ఆ రకంగా హీరోలకు టాప్ హీరోయిన్లు చెక్ పెట్టేస్తారా? అంటూ సరికొత్త సందేహం మొదలైంది.