Begin typing your search above and press return to search.

100 కోట్ల పారితోషికం క్ల‌బ్ లో టాప్ 5 స్టార్లు

By:  Tupaki Desk   |   5 Jan 2023 4:44 AM GMT
100 కోట్ల పారితోషికం క్ల‌బ్ లో టాప్ 5 స్టార్లు
X
భార‌తీయ సినిమా వందేళ్ల చ‌రిత్ర‌లో టాలీవుడ్ 90ఏళ్ల సుదీర్ఘ ప్ర‌స్థానాన్ని క‌లిగి ఉంది. ఇన్నేళ్ల‌లో 100 కోట్ల క్ల‌బ్ సినిమా అన్న‌దే ఒక ఘ‌నకార్యం అనుకుంటే ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల క్ల‌బ్ 2000 కోట్ల క్ల‌బ్ అంటూ ఆకాశ‌మే హ‌ద్దుగా ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఇప్పుడు ఒక్కో టాలీవుడ్ క‌థానాయ‌కుడు 100 కోట్ల పారితోషికం అందుకుంటూ సంచ‌ల‌నంగా మారుతున్నారు. ఈ జాబితాలో ఐదుగురు టాప్ హీరోల పేర్లు ఉన్నాయి. ఒక్కో సినిమాకి ర‌జ‌నీకాంత్ 100 కోట్ల పారితోషికం అందుకున్నార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి.

కానీ ఆ త‌ర్వాత బాహుబ‌లి ఫ్రాంఛైజీతో ప్ర‌భాస్ సంచ‌ల‌నంగా మారాడు. ఈ ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు దాదాపు 2200 కోట్లు వ‌సూలు చేయ‌డంతో అత‌డి స్టార్ డ‌మ్ అమాంతం మారిపోయింది. బాహుబ‌లి స‌క్సెస్ త‌ర్వాత దేశంలోనే మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌భాస్ ఎదిగాడు. అత‌డి సినిమాల‌కు బ‌డ్జెట్ల‌ను పెంచారు. పారితోషికంగా పెద్ద మొత్తాల‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఒక్కో సినిమాకి 100కోట్లు అందుకుంటున్నాడ‌న్న చ‌ర్చ ఉంది.

ప్ర‌భాస్ -1వ వాడు కాగా.. రెండో స్థానంలో రామ్ చ‌ర‌ణ్ పేరు వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో 1000 కోట్ల క్ల‌బ్ సినిమాలో హీరోలుగా చ‌ర‌ణ్‌-తార‌క్ పేర్లు చేరాయి. ఆ ఇద్ద‌రూ వంద కోట్ల పారితోషికం అందుకునే దిశ‌గా ముంద‌డుగు వేస్తున్నార‌న్న టాక్ ఉంది. త‌దుప‌రి రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ తో భారీ బ‌డ్జెట్ సినిమా కోసం 100 కోట్లు అందుకుంటున్నార‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. ఈ సినిమాని దిల్ రాజు దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం.

మ‌రోవైపు ఆర్.ఆర్.ఆర్ భీమ్ పాత్ర‌తో ఎన్టీఆర్ కూడా త‌న స్థాయిని పెంచుకున్నారు. అత‌డు ప్ర‌స్తుతం కొర‌టాల‌తో సినిమా త‌ర్వాత కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో క‌లిసి ప‌ని చేయ‌నున్నాడు. ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

త‌దుప‌రి రేస్ లోకి మ‌హేష్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ దూసుకొస్తున్నారు. రాజ‌మౌళి సినిమాతో మ‌హేష్ 100 కోట్ల పారితోషికం క్ల‌బ్ లోకి అడుగు పెడ‌తాడ‌ని భావిస్తున్నారు. ఈ సినిమాకి ఏకంగా 500 కోట్లు మించిన బ‌డ్జెట్ ని కేటాయిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.

ఇక పుష్ప చిత్రంతో బ‌న్నీ హ‌వా దేశవ్యాప్తంగా కొన‌సాగింది. పుష్ప‌రాజ్ గా అత‌డి న‌ట‌న‌కు దేశ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అందుకే ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. పుష్ప 2తో పాన్ ఇండియాలో కొట్టేస్తే బ‌న్నీ కూడా పారితోషికంలో 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌తాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ కి వీర‌మ‌ల్లుతో ఛాన్సుందా లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఈ సినిమాని కూడా బాహుబ‌లి త‌ర‌హాలో నే పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుండ‌డంతో అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. భారీ ప్యాకేజీల రూపంలో స్టార్ హీరోలు పారితోషికాలు అందుకుంటుండ‌డం తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.