Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ 150 కోట్లు మించిన‌ టాప్ 5 సినిమాలివే

By:  Tupaki Desk   |   16 July 2022 11:30 PM GMT
బ‌డ్జెట్ 150 కోట్లు మించిన‌ టాప్ 5 సినిమాలివే
X
భార‌త‌దేశం నుంచి ప్రతి సంవత్సరం 20 కంటే ఎక్కువ భాషలలో 1500-2000 సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. చిన్న మధ్యస్థ సినిమాల నుండి భారీ బడ్జెట్ సినిమాల వరకు అన్ని స్థాయిల్లో సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో భారీ బడ్జెట్ సినిమాలొస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో సినిమాలు ప్రాంతీయ కంటెంట్ క్రాస్-ఓవర్ ప్ర‌గ‌తితో గొప్ప‌ సినిమాటిక్ అనుభవాలను అందిస్తున్నాయి. ఎక్కువ మంది ప్రేక్షకుల‌ను చేరుకునేందుకు ఇటీవ‌ల‌ భారీ-బడ్జెట్ సినిమాలు రూపొందిస్తున్నారు. RRR- KGF చాప్టర్ 2 వంటి బిగ్ రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించాక ఈ ఒర‌వ‌డి మ‌రింత పెరుగుతోంది. 2022-23 సీజ‌న్ లో 150కోట్లు మించిన బ‌డ్జెట్ల‌తో మిస్ చేయకూడని సినిమాల జాబితా ఇలా ఉంది.

1. పొన్నియ‌న్ సెల్వ‌న్
150 కోట్లు అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న టాప్ 5 భార‌తీయ సినిమాల్లో మ‌ణిర‌త్నం 'పొన్నియిన్ సెల్వన్' ఒక‌టి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. పీరియాడికల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఇందులో విక్రమ్- ఐశ్వర్య రాయ్ బచ్చన్- కార్తీ- జయం రవి- త్రిష- జయరామ్- శోభితా ధూళిపాళ- ఐశ్వర్య లక్ష్మి-విక్రమ్ ప్రభు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి 1955 నవలకి తెర రూపం అని చెప్పాలి. మాస్ట్రో AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

2. శంషేరా
ర‌ణ‌బీర్ క‌పూర్ క‌థానాయకుడిగా యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ మరో భారీ-బడ్జెట్ ప్రాజెక్ట్ 'శంషేరా' 1800ల నాటి పీరియాడికల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఇది బ్రిటీష్ పాలనలో స్వాతంత్య్రం కోసం పోరాడే ఒక దొంగ క‌థ‌. త‌మ తెగకు నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కథను తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ బాహుబలి- గ్లాడియేటర్ ల‌ను త‌ల‌పించింది.

3. ఆదిపురుష్ 3డి
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ఓంరౌత్ రూపొందిస్తున్న చిత్రం ఆదిపురుష్ 3డి. రామాయణం ఆధారంగా రూపొందుతున్న‌ పీరియాడికల్ డ్రామా. 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్- కృతి సనన్- సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. భారీ పెట్టుబడికి కారణం విస్తృతమైన VFX అని తెలిసింది. దీనికోసం మేకర్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను బ‌రిలో దించారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి.

4. టైగ‌ర్ - 3
విజయవంతమైన టైగ‌ర్ ఫ్రాంచైజీ నుంచి టైగర్ 3 రూ 225 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ - క‌త్రిన కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్ష‌న్ చిత్రం 2023 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

5. బడే మియాన్ చోటే మియాన్ 2
300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్న 'బడే మియాన్ చోటే మియాన్ 2' లో అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ క‌థానాయ‌కులు. సామ్రాట్ పృథ్వీరాజ్- హీరోపంతి 2 బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత ఈ సినిమాపైనే ఆ ఇద్ద‌రి హోప్స్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రాన్ని వాషు భగ్నాని నిర్మిస్తున్నారు.

6. పఠాన్
షారుఖ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పఠాన్. య‌ష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తోంది. 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న‌ ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ కలిసి తెర‌పై క‌నిపించ‌నున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎట్టకేలకు జ‌న‌వ‌రి 25న‌ విడుదలకు తేదీని ఖ‌రారు చేసారు.

భార‌తీయుడు 2
S. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపుల‌రైంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తమిళం-తెలుగు-హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. కమల్ హాసన్ ఇప్పటికే 'విక్రమ్'తో బ్లాక్ బస్టర్ అందుకుని హుషారుగా ఉన్నాడు. భారతీయుడు 2 కోసం అత‌డు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

8. బ్రహ్మాస్త్ర
ర‌ణ‌బీర్ క‌పూర్ -అయాన్ ముఖర్జీ కాంబినేష‌న్ మూవీ ఇది. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ ను ఖ‌ర్చు చేస్తున్నార‌. VFX ఈ సినిమాకి అత్యంత కీల‌కం కానుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ -DC కామిక్స్ రూపొందించిన సినిమాల త‌ర‌హాలో ప్ర‌య‌త్న‌మిది. వీక్షకులకు భారతదేశపు మొట్టమొదటి అసలైన విశ్వం - ఆస్ట్రావర్స్ ను పరిచయం చేస్తున్నామ‌ని మేక‌ర్స్ టీజ‌ర్ లో ప్ర‌క‌టించారు. రణబీర్ కపూర్- అలియా భట్- అమితాబ్ బచ్చన్- నాగార్జున- మౌని రాయ్ తదితరులు నటించిన ఈ చిత్రం మంచి vs చెడు గురించి చెబుతుంది. ప్రేమ- ఆశ స‌హా ఎన్నో అంశాల చుట్టూ క‌థ న‌డుస్తుంది.