Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: `బుక్ మై షో`లో బాలీవుడ్ నే కొట్టేశారు

By:  Tupaki Desk   |   27 Dec 2020 6:00 AM IST
ట్రెండీ టాక్‌: `బుక్ మై షో`లో బాలీవుడ్ నే కొట్టేశారు
X
ప్ర‌ఖ్యాత ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఏదైనా సినిమా రిలీజ‌వుతోంది అంటే ప్రేక్ష‌కులు తొలిగా వెతికే ఆన్ లైన్ పోర్ట‌ల్ ఇదే. ఈ ఏడాది క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల దాదాపు ఎనిమిది నెల‌లుగా థియేట‌ర్లు మూత‌ప‌డినా జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కూ థియేట‌ర్లు తెరుచుకోవడంతో అప్ప‌ట్లో ఆన్ లైన్ టికెటింగ్ సాగింది.

2020లో బుక్ మై షో బెస్ట్ టికెటింగ్ ఏ సినిమాల‌కు అన్న‌ది చూస్తే.. ఈ ఏడాది మూడు తెలుగు సినిమాలు టాప్ 5లో నిలిచాయి. ఇందులో టాప్ 2 చిత్రంగా అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` రికార్డు సాధంచ‌గా.. టాప్ 3 చిత్రంగా మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. టాప్ 5 చిత్రంగా నితిన్ భీష్మ రికార్డుల‌కెక్కాయి.

మ‌న తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాల‌తో పోటీప‌డి ఈ క్రెడిట్ ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిక‌రం. ఆన్ లైన్ టికెటింగ్ ప‌రంగా ఇండియా టాప్ 10లో బాలీవుడ్ టాలీవుడ్ దే ఎప్పుడూ హ‌వా సాగుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదన్న విశ్లేష‌ణ వెలువ‌డింది.