Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లిసంద‌డిలో టాప్ 120 గెస్ట్స్

By:  Tupaki Desk   |   8 Dec 2020 9:07 AM IST
మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లిసంద‌డిలో టాప్ 120 గెస్ట్స్
X
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఐజీ కుమారుడు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బుధ‌వారం సాయంత్రం ఈ జంట వివాహం రాజస్థాన్ ఉదయపూర్ లోని ఉదై ప్యాలెస్ హోటల్ లో జ‌ర‌గ‌నుంది. పెళ్లి బృందాలు స‌హా.. వేడుక‌కు ఆహ్వానితులందరూ ఇప్పటికే వేదికకు చేరుకున్నారు. వివాహానికి ముందు వేడుకల్లో పాల్గొన్నారు.

అయితే ఈ పెళ్లికి విచ్చేసిన అతిథులు ఎంత‌మంది? టాప్ గెస్ట్స్ ఎవ‌రెవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలే తెలిసాయి. మొత్తం 120 మంది అతిథులను వివాహానికి ఆహ్వానించార‌ని స‌మాచారం. ఆహ్వానించబడిన వారందరికీ పట్టు వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. వారికి ఉదై ప్యాలెస్ హోటల్ ‌లో ఖరీదైన సూట్ల‌లో వసతి కల్పించారు. సన్నిహిత కుటుంబ సభ్యులే కాకుండా.. చిత్ర పరిశ్రమకు చెందిన ప్ర‌ముఖులు.. నిహారిక- చైత‌న్య‌ల‌కు క్లోజ్ స్నేహితులు ఈ పెళ్లికి విచ్చేశారు. లావణ్య త్రిపాఠి- రితు వర్మ కూడా ఉదయపూర్ లో వెన్యూ వ‌ద్ద‌కు అడుగుపెట్టారు.

సోమ‌వారం సాయంత్రమే మెగాస్టార్ చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ - బ‌న్ని - అల్లు అర‌వింద్ కుటుంబ స‌మేతంగా ఉద‌య్ ప్యాలెస్ కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. మెగా యువ‌హీరోలు ఇప్పటికే ఈ వేదిక‌కు చేరుకున్నార‌న్న స‌మాచారం ఉంది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోలు.. అగ్ర ద‌ర్శ‌కులు.. టాప్ ప్రొడ్యూస‌ర్స్ ..నేడు వివాహానికి అటెండ్ కానున్నార‌ని తెలుస్తోంది.