Begin typing your search above and press return to search.

OTTలో టాప్-10 తెలుగు సినిమాలివే

By:  Tupaki Desk   |   1 May 2021 5:00 AM IST
OTTలో టాప్-10 తెలుగు సినిమాలివే
X
సెకండ్ వేవ్ ప్ర‌భావంతో థియేట‌ర్ల‌ను మూసివేయ‌గా ఓటీటీల హ‌వా కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్ లో టాప్ 5 రిలీజ్ లు ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండ‌డం ఒక సంచ‌ల‌నం కాగా.. మంచు విష్ణు- మోస‌గాళ్లు.. నితిన్ చెక్- రంగ్ దే చిత్రాలు ఓటీటీల్లో రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

కార్తీ న‌టించిన‌ సుల్తాన్ ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతోంది. ఇది వారాంతంలో వీక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. సందీప్ కిష‌న్ A1 ఎక్స్‌ప్రెస్ మే 1 నుండి సన్ నెక్ట్స్ లో రానుంది. రానా దగ్గుబాటి అరణ్య కూడా ఒకటి లేదా రెండు వారాల్లో డిజిటల్ వేదిక‌పై స్ట్రీమ్ అవుతాయి.

మంచు విష్ణు `మోస‌గాళ్లు` ఈ నెలలో డిజిటల్ విడుదల కానుంది. వీటితో పాటు.. చిన్న సినిమాలు డబ్ చేసిన సినిమాలు మే నెలలో వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో అల‌రిస్తాయి. ఇవి కాకుండా టాప్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ లో చాలా డిజిటల్ షోలు వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. సెకండ్ వేవ్ పుణ్య‌మా అని ఇంట్లోనే అంద‌రికీ బోలెడంత వినోదం సిద్ధం.