Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ త‌ర్వాత టాప్‌-10 రిలీజ్ లు ఇవే!

By:  Tupaki Desk   |   26 Aug 2021 12:02 PM IST
సెకండ్ వేవ్ త‌ర్వాత టాప్‌-10 రిలీజ్ లు ఇవే!
X
క‌రోనా మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ అనంత‌రం సినిమాల‌ రిలీజ్ షెడ్యూళ్ల‌పై ర‌క‌ర‌కాల క‌న్ఫ్యూజ‌న్లు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఏది థియేటర్ల‌లో విడుద‌ల‌వుతుంది? ఏది ఓటీటీల్లో వస్తుంది? అన్న‌దానిపైనా స‌రైన స్ప‌ష్ఠ‌త లేదు.

ఇప్ప‌టికే గోపిచంద్ `సీటీమార్`.. అవ‌స‌రాల `101 జిల్లాల అందగాడు` చిత్రాలు సెప్టెంబర్ 3న థియేట్రిక‌ల్ గా విడుద‌లవుతాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. వీటికి సంబంధించి మేక‌ర్స్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబ‌ర్ 3న `ప్రియమైన మేఘ` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 10న రెండు పెద్ద సినిమాలు రిలీజ్ ల‌కు రానున్నాయి. వీటిలో నాగ‌చైత‌న్య `ల‌వ్ స్టోరి` థియేట్రిక‌ల్ రిలీజ్ తేదీ అధికారికంగా క‌న్ఫామ్ కాగా కంగ‌న త‌లైవి ని అదే రోజున వినాయ‌క చ‌వితి వారంతంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. త‌లైవి పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కానుంది. టక్ జగదీష్ - సెప్టెంబర్ లో ప్రైమ్ వీడియో (OTT) లో విడుద‌ల కానుంది. అలాగే నితిన్ - మాస్ట్రో - హాట్ స్టార్ (OTT) లో సెప్టెంబర్ లోనే విడుద‌లవుతుంది. సెప్టెంబ‌ర్ 10న ఇత‌ర సినిమాలు రిలీజ‌వుతున్నందున ట‌క్ జ‌గ‌దీష్.. మాస్ట్రో రిలీజ్ తేదీల్ని వాయిదా వేశార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకే నిర్మాత‌లు ప్లాన్ చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అలాగే మాస్ట్రో రిలీజ్ తేదీపైనా నితిన్ వ‌ర్గాలు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించాల్సి ఉంటుంది.

సెప్టెంబ‌ర్ 9 నుంచి మాస్ట్రో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేసినా ఇప్పుడు తేదీ మారింద‌ని స‌మాచారం. ట‌క్ జ‌గ‌దీష్ ఆ మ‌రునాడే అంటే సెప్టెంబ‌ర్ 10 నుంచే స్ట్రీమింగుకి రెడీ అవ్వాల్సి ఉన్నా ఇంకా డైల‌మా నెల‌కొంది. నిర్మాత‌లు తేదీల్ని అధికారికంగా ప్ర‌క‌టించాకే దీనిపై క్లారిటీ వ‌స్తుంది.

ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 1న సాయి తేజ్ రిప‌బ్లిక్ రిలీజ్ కానుంది. సాయి తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన రెండో సినిమా `కొండపోలం` అక్టోబర్ 08 న విడుద‌ల‌కు ప్లాన్ చేశార‌ని తెలిసింది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి ద‌స‌రా కానుక‌గా RRR అక్టోబర్ 13న విడుద‌ల కావాల్సి ఉండ‌గా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కి వాయిదా ప‌డింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.