Begin typing your search above and press return to search.

సూపర్ పోలీస్ గా రామ్ చరణ్

By:  Tupaki Desk   |   20 Dec 2016 10:30 PM GMT
సూపర్ పోలీస్ గా రామ్ చరణ్
X

రామ్ చరణ్ మూవీ ధృవకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళనాడులో కూడా ఈ మూవీకి చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్లు వస్తున్నాయి. దీంతో చెర్రీ నటించిన పాత సినిమాలు కూడా తమిళ్ లోకి క్యూ కట్టేస్తున్నాయి. అయితే, సాధారణంగా హిట్ సినిమాలను ఇలా డబ్బింగ్ చేసి వదులతుండడం చూస్తుంటాం.

కానీ.. మెగా పవర్ స్టార్ కెరీర్ లో ఫ్యాన్స్ కూడా గుర్తుంచుకోలేని మూవీ తుఫాన్. హిందీ మూవీ జంజీర్ ను గా అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేయగా తెలుగులో తుఫాన్ గా ఈ చిత్రం విడుదలైంది. ఇఫ్పుడీ సినిమా తమిళ్ లోకి సూపర్ పోలీస్ పేరుతో డబ్ అవుతోంది. ప్రధానంగా చెర్రీతో పాటు జంటగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటించడం అసలు కారణంగా చెప్పచ్చు. ఈ సినిమాను తమిళ్ లోకి సూపర్ పోలీస్ గా డబ్బింగ్ చేస్తుండగా.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాయట.

అప్పట్లోనే రిలయన్స్ బిగ్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు సూపర్ పోలీస్ గా తమిళ్ లోకి తీసుకెళుతున్నారు నిర్మాతలు. డిసెంబర్ లోనే సూపర్ పోలీస్ గా తమిళంలో చెర్రీ సత్తా చాటబోతున్నాడట. అక్కడ ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/