Begin typing your search above and press return to search.

ట్యాగ్ కోసం డబ్బులిచ్చి మరీ ప్రమోషన్ చేయించుకుందా..?

By:  Tupaki Desk   |   18 May 2021 7:00 AM IST
ట్యాగ్ కోసం డబ్బులిచ్చి మరీ ప్రమోషన్ చేయించుకుందా..?
X
టాలీవుడ్ గడపతొక్కిన శాండిల్ వుడ్ బ్యూటీ ఒకరు అనతికాలంలోనే అశేష అభిమానునలను సంపాదించుకుంది. వరుస అవకాశాలతో పాటుగా హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్‌ గా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలలో కూడా పాగా వేయాలని ప్లాన్ చేసుకుంది. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు ఎంపిక చేసుకుంటున్న ఈ భామ.. ఇటీవల ఓ అరుదైన ఘనత సాధించి అందరినీ షాక్ కి గురి చేసింది.

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ గా మారిన ఈ బ్యూటీ గురించే ఎక్కువగా నెటిజన్స్ సెర్చ్ చేసినట్లుగా ప్రకటిస్తూ గూగుల్‌ ఓ కొత్త ట్యాగ్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అమ్మడి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన అభిమానులు ప్రేక్షకులపై ప్రేమ కురిపించింది ఈ బ్యూటీ. అయితే ఆమెకు ఈ గుర్తింపు దక్కడం పట్ల నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు.

డ‌బ్బులిచ్చి మరీ ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేయించుకుందని కొందరు విమర్శలు చేశారు. దీని కోసం అమ్మడు దాదాపుగా 25 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసింద‌ని సినీ వ‌ర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఓ సందర్భంలో తనకు కొత్తగా వచ్చిన ట్యాగ్ లైన్ గురించి ప్రశ్నించగా.. ఈ ముద్దుగుమ్మ త‌న‌కేమీ తెలియ‌దు అన్న‌ట్లుగా ఫేస్ ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చిందట. దీంతో చేసుకుంది పెయిడ్ ప్ర‌మోష‌న్ కానీ త‌న‌కేం తెలిన‌ట్లుగా బిల్డ్ అప్ ఇస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.