Begin typing your search above and press return to search.

స్సేస్ లో టామ్ క్రూజ్ విన్యాసాలు!

By:  Tupaki Desk   |   11 Oct 2022 5:12 AM GMT
స్సేస్ లో టామ్ క్రూజ్ విన్యాసాలు!
X
అంతరిక్షంలోకి శిక్షణ తీసుకున్న వ్యోమగాములు తప్ప.. మిగిలిన వారు ఎవరూ వెళ్లలేరు. అలా వెళ్లడానికి ఎంతో ఖర్చు కావడంతోపాటు.. మరెంతో శిక్షణ కూడా అవసరం. అన్నిరకాల శిక్షణల్లో పాసైన తర్వాతగానీ.. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లేందుకు అనుమతి లభించదు. కానీ ఇప్పు డు అక్కడ ఏకంగా ఓ సినిమానే తీయబోతున్నారు.

ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ హీరోగా స్పేస్ లో సినిమా తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్దం అవుతోంది. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా సినిమాలోని ప్రధాన సన్నివేశాలను అంతరిక్ష కేంద్రంలోని రియల్ లొకేషన్లలో చిత్రీకరించాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ను పరిశీలిస్తున్నారు. డూప్తో పనిలేకుండా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టే అరవై ఏళ్ల టామ్ క్రూజ్.. అంతరిక్షంలో సైతం అదరగొడతారని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

దీనికి సంబంధించి UFEG ఛైర్మన్ డోనా లాంగ్లీ మాట్లాడుతూ.. సినిమాలో ఎక్కువ భాగం భూమిపై చిత్రీకరించబడుతుందని.. ప్రధాన పాత్రని మాత్రం అంతరిక్షంలోకి తీసుకెళ్తామ‌న్నారు. ఆ ర‌కంగా స్పేస్‌వాక్ చేసిన మొదటి పౌరుడు టామ్ క్రూజ్ అవుతాడని అన్నారు. మొత్తానికి టామ్ విన్యాసాలు స్పేస్ లోనూ షురూ అయిన‌ట్లు తెలుస్తోంది. యాక్ష‌న్ స్టార్ గా టామ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌లు గాంచిన న‌టుడు. ప్ర‌తీ సినిమాతోనూ ప్రేక్ష‌కుల‌కు అల‌రించ‌డం టామ్ కే చెల్లింది. గ‌తంలో మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్ కోసం టామ్ క్రూజ్ ఎటువంటి సహాయం లేకుండా గాలిలో ఎర్రటి బైప్లేన్ నుండి వేలాడుతూ కనిపించిన దృశ్యాలు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపాయి.

మ‌రి ఇప్పుడు ఏకంగా స్పేస్ లోనే విన్యాసాల‌కు రెడీ అవ్వ‌డంతో అక్క‌డెలాంటి సాహ‌సాల‌కు పూనుకుంటాడు? అన్న ఉత్సాహం..ఆందోళ‌న సైతం అభిమానుల్లో మొద‌లైంది. టామ్ ని స్పేస్ వ‌ర కూ తీసుకెళ్లే బాధ్య‌త‌లు డౌగ్ లిమాన్ స్పేస్ సెంట‌ర్ తో యూనివర్సల్ ఫిల్మ్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్‌ సంప్రదించిన‌ట్లు తెలుస్తోంది.

అంతరిక్షం కథాంశంగా ఇప్ప‌టివ‌ర‌కూ 'గ్రావిటీ'.. 'ఇంటర్‌స్టెల్లార్'. 'స్టోవే' వంటి అనేక చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. అలాగే తెలుగులో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 'అంత‌రిక్షం' టైటిల్ తోనూ ఓ సినిమా చేసారు. అది యావ‌రేజ్ గా ఆడింది. అయితే ఇవ‌న్నీ స్సేస్ సెట్ ని సిద్దం చేసి భూమ్మీద చిత్రీక‌రించిన సినిమాలు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.