Begin typing your search above and press return to search.

ఒక్క సీన్‌ కోసం రూ. 19 కోట్లు మరియు ప్రాణాలు పణంగా పెట్టారు

By:  Tupaki Desk   |   18 Sept 2020 5:00 AM IST
ఒక్క సీన్‌ కోసం రూ. 19 కోట్లు మరియు ప్రాణాలు పణంగా పెట్టారు
X
హీరోలు ఎక్కువగా రిస్కీ షాట్స్‌ కోసం డూప్‌ ను వాడుతుంటారు. కాని కొందరు మాత్రం తామే రిస్కీ షాట్స్‌ ను చేసేందుకు ఎప్పుడు ముందు ఉంటారు. వారిలో ఒకరు హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ టామ్‌ క్రూజ్‌. ఈయన విమానం నుండి కిందకు దూకడం, కొండ చెరియలపై నుండి దూకడం వంటివి గతంలో చేశాడు. ప్రాణాలతో చెలగాటం అని తెలిసి కూడా ఏమాత్రం భయపడకుండా ఆయన చేసే సీన్స్‌ ఆయన సంగతి ఏమో కాని ప్రేక్షకులకు గుండె పోటు తెప్పించే విధంగా ఉంటాయి. తాజాగా మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌ కొత్త సినిమా కోసం అత్యంత ప్రమాదకరమైన మోటర్‌ సైకిల్‌ స్టంట్‌ ను చేశాడు. ఆ సీన్‌ కోసం ఏకంగా 19 కోట్లను ఖర్చ చేయడంతో పాటు కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు సైతం పోయే అవకాశం ఉన్నా కూడా లెక్క చేయలేదు.

నార్వేలో తీసిన ఈ సీన్‌ గురించి చెబితేనే ఒల్లు గగుర్లు పొడిచేలా ఉంది. మోటలర్‌ సైకిల్‌ పై స్పీడ్‌ గా వస్తూ కొండల పై నుండి బండి తో సహా లోయలోకి దూకాలి. ఆ సమయంలో పారాచూట్‌ను ఓపెన్‌ చేసుకుని సేఫ్‌ గా ల్యాండ్‌ అవ్వాలి. ఇది సినిమాల్లో గ్రాఫిక్స్‌ పెట్టి చేయవచ్చు. కాని రియల్‌ గా మాత్రం ఇది సాధ్యం కాదని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాని టామ్‌ క్రూజ్‌ అసాధ్యంను సుసాధ్యం చేశారు. మరోసారి అబ్బురపర్చే స్టంట్‌ తో మెస్మరైజ్‌ చేశాడు. అతడి పట్టుదలకు అంతా కూడా వామ్మో అంటున్నారు. ఆరు పదుల వయసుకు దగ్గర పడ్డ టామ్‌ క్రూజ్‌ ఇలాంటి సాహసాలు చేయడం అంటే కొన్ని వందలు వేల మంది ప్రస్తుతం ఉన్న హీరోలకు రాబోయే హీరోలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు.