Begin typing your search above and press return to search.

మ‌న యంగ్ హీరోల స్టైల్ అట్లుంట‌ది మ‌రి

By:  Tupaki Desk   |   17 Jun 2022 12:30 AM GMT
మ‌న యంగ్ హీరోల స్టైల్ అట్లుంట‌ది మ‌రి
X
సినీరంగంలో ఎవ‌రో అవ‌కాశాలు ఇవ్వాల‌ని.. హీరోలుగా ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో నిరూపించుకుంటామ‌ని అప్ప‌ట్లో యంగ్ హీరోలు సినిమా ఆఫీసుల‌ వెంట తిరిగే వారు. కానీ ఇప్ప‌డు ట్రెండు మారింది. హీరో కావాలంటే.. ఒక్క ఛాన్స్ రావాలంటే యంగ్ టాలెంటెడ్ హీరోస్ ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ్ల‌డం లేదు. త‌మ‌కి తామే అవ‌కాశాల్ని సృష్టించుకుంటున్నారు.. హీరోలుగా రాణిస్తున్నారు. ఇందు కోసం కొంత మంది యంగ్ హీరోలు ఎంచుకున్న న‌యా రూట్ రైటింగ్‌. క‌థ‌లు, డైలాగ్ లు రాసేస్తూ కెరీర్ ని స‌రికొత్త పంథాలో తీర్చిదిద్దుకుంటూ యంగ్ హీరోల స్టైల్ అట్లుంట‌ది మ‌రి అనిపించుకుంటున్నారు.

ఈ జాబితాలో ఐదుగురు యంగ్ హీరోలు త‌మ స‌త్తా చ‌టుతూ సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకుంటున్నారు. ఇందులో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న హీరో అడివి శేష్‌. యుస్ లో యూవీ మేకింగ్ మెల‌కువ‌లు నేర్చుకున్న అడివి శేష్ తొలి ప్ర‌య‌త్నంగా హీరో, ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా చేసిన ప్ర‌య‌త్నం 'క‌ర్మ‌'. ఇది మిస్ ఫైర్ కావ‌డంతో డైరెక్ష‌న్ ప‌క్క‌న పెట్టినా హీరోగా, రైట‌ర్ గా మాత్రం కంటిన్యూ అవుతూనే వున్నాడు. 'క్ష‌ణం' మూవీ సూప‌ర్ హిట్ కావ‌డంతో ఇదే పంథాను కంటిన్యూ చేస్తున్నారు.

ఈ మూవీకి అడివిశేష్ న‌టించి క‌థ అందించ‌డ‌మే కాకుండా మ‌రో ఇద్ద‌రితో క‌లిసి స్క్రీన్ ప్లే అందించాడు. ఇదే త‌ర‌హాలో 'గూఢ‌చారి'కి క‌థ‌, స్క్రీన్ ప్లే అందించి సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఇక రీసెంట్ గా విడుద‌లైన 'మేజ‌ర్‌' మూవీకి కూడా క‌థ‌, స్క్రీన్ ప్లే అందించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీస్ అన్నీ అడివి శేష్ కి మంచి విజ‌యాల్ని అందించి అత‌ని కెరీర్ ని మ‌లుపు తిప్పాయి. ఇక ఇదే త‌ర‌హాలో మ‌రో యంగ్ హీరో కూడా త‌న సినిమాల‌కు పెన్ను ప‌డుతున్నాడు.

అత‌నే డీజే టిల్లు హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌. 'గుంటూర్ టాకీస్‌' మూవీతో క‌థా ర‌చ‌యిత‌గా, డైలాగ్ రైట‌ర్ గా ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు. తొలి ప్ర‌య‌త్న‌మే స‌క్సెస్ అందించ‌డంతో త‌ను న‌టిస్తున్న ప్ర‌తీ సినిమాకు క‌థ‌, మాట‌లు, లేదా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అందిస్తూ సినిమా విజ‌యాల్లో కీల‌క భూమిక పోషిస్తున్నాడు. 'క‌ష్ణ అండ్ హిస్ లీలా', మా వింత గాధ వినుమా వంటి చిత్రాల‌కు క‌థ‌, మాట‌లు అందించాడు. ఇక ఇటీవ‌ల విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన 'డీజే టిల్లు'కు ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ‌తో క‌లిసి క‌థ‌, మాటలు అందించాడు.

ఇక 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌', 'జాతిర‌త్నాలు' చిత్రాల‌తో న‌వ్వించి సూప‌ర్ హిట్ లు అందుకున్న న‌వీన్ పొలిశెట్టి కూడా త‌న ఎక్స్ ట్రా టాలెంట్ ని చూపిస్తూ త‌న సినిమాల విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌' మూవీకి న‌వీన్ పొలిశెట్టి దర్శ‌కుడు స్వ‌రూప్ తో క‌లిసి స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీ మంచి విజ‌యాన్ని సాధించి హీరోగా అత‌నికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ కూడా ఇదే దారిలో న‌డుస్తున్నాడు. వెళ్లిపోమాకే, ఈ న‌గ‌రానికి ఏమైంది?' వంటి చిత్రాల‌తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న విశ్వ‌క్ సేన్ 'ఫ‌ల‌క్ నుమా దాస్‌' మూవీతో దర్శ‌కుడిగా, క‌థ‌కుడిగాస‌రికొత్త అవ‌తారం ఎత్తారు. ఈ మూవీ స‌క్సెస్ కావ‌డంతో త్వ‌ర‌లో దీనికి సీక్వెల్ గా 'దాస్ కి ద‌మ్కీ' పేరుతో ఓ మూవీని చేయ‌బోతున్నారు. హీరోగా, స్టోరీ రైట‌ర్ గానూ ఈ మూవీకి అన్ని బాధ్య‌తలు త‌నే తీసుకుంటున్నాడు.

ఇక మ‌రో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా రైట‌ర్‌గానూ త‌న స‌త్తాని చాటుకుంటున్నాడు. 'రాజావారు రాణిగారు' మూవీతో ప‌రిచ‌య‌మైన ఈ హీరో ఇటీవ‌ల విడుద‌లైన 'ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ్ మండ‌పం' మూవీకి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు అందించారు. ఈ మూవీ మ్యూజిక‌ల్ గా మంచి విజ‌యాన్ని సాధించి నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చిపెట్టింది. హీరోలుగా రాణిస్తున్న ఈ యంగ్ టాలెంట్స్ ద‌ర్శ‌కులుగా, క‌థా ర‌చ‌యిత‌లుగా త‌మ‌లోవున్న మ‌రో టాలెంట్ ని కూడా బ‌య‌ట‌పెడుతూ మ‌న యంగ్ హీరోల స్టైల్ అట్లుంట‌ది మ‌రి అనిపిస్తుండ‌టం విశేషం.