Begin typing your search above and press return to search.

కుర్రాళ్లంతా హిట్టు కోసం వెయిటింగే!!

By:  Tupaki Desk   |   13 July 2016 5:06 AM GMT
కుర్రాళ్లంతా హిట్టు కోసం వెయిటింగే!!
X
కుర్ర హీరోలు సాధారణంగా స్పీడ్ చూపిస్తుంటారు. తెగ సినిమాలు చేసేస్తూ తమ ఎనర్జీ అంతా సినిమాల్లో చూపించేందుకు ట్రై చేస్తుంటారు. అయితే టాలీవుడ్ లో చాలామంది కుర్రాళ్లు ఇప్పుడు హిట్ కోసం చాలాకాలంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే సినిమాల సంఖ్య తగ్గించుకుని.. ఆడియన్స్ తమ నుంచి కోరుకునే వాటిని అందించేందుకు ట్రై చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్నవారిలో కొందరి సినిమాలు ఈ సీజన్ లోనే రిలీజ్ కానున్నాయి.

తన కామెడీతో మినిమం హిట్ గ్యారంటీ అనిపించుకున్న అల్లరి నరేష్ పరిస్థితి ప్రస్తుతం బాలేదు. కొన్నేళ్లుగా వెయిటింగ్ తప్ప హిట్ లేదు. ఇప్పుడు సెల్ఫీరాజాతో స్పూఫ్ లు మాత్రమే కాకుండా క్లీన్ కామెడీ కూడా ఇస్తానని ప్రామిస్ చేసిన అల్లరి నరేష్.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల మందుకు వచ్చేయనున్నాడు. మరో కామెడీ హీరో సునీల్ సిట్యుయేషన్ లో కూడా ఏం తేడా లేదు. సిక్స్ ప్యాకులు పెంచి హీరోయిజం చూపించినా ఆడియన్స్ పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు రాబోతున్న జక్కన్నలో కామెడీ ఇరగదీసేస్తా అంటున్నాడు. ఈ నవ్వులు పేలాయంటే హిట్ దక్కేసినట్లే.

సాయి కుమార్ తనయుడు ఆదికి కూడా మొదట్లో హిట్స్ వచ్చినా తర్వాతన్నీ ఫ్లాపులే. ఇప్పుడు చుట్టాలబ్బాయి అంటూ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ రెండు సినిమాలు చేసినా ఇప్పటికీ హిట్ దక్కలేదు. శ్రీరస్తు శుభమస్తుతో ఆ కొరత తీర్చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు శిరీష్. ఇక అక్కినేని వంశానికి చెందిన హీరో సుశాంత్ అడ్డా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆటాడుకుందాం..రా అనే సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలు కుర్రాళ్ల కోరికలను తీరుస్తాయని భావిద్దాం.