Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్స్ కి ఫ్యామిలీయే ఫస్ట్

By:  Tupaki Desk   |   9 Jan 2016 11:30 AM GMT
సూపర్ స్టార్స్ కి ఫ్యామిలీయే ఫస్ట్
X
సినిమా స్టార్స్ వ్యక్తిగత జీవితం అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్. అందుకే వాళ్లు చేసే ప్రతీ చిన్న పనినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ తమ పర్సనల్ జీవితాన్ని ప్రొఫెషన్ తో కలపకుండా ఉండేందుకు స్టార్స్ చాలా ప్రయత్నిస్తుంటారు. అలాగే ప్రొఫెషన్ - పర్సనల్ లైఫ్ లను బ్యాలెన్స్ చేయడంలో.. ఇప్పటితరం స్టార్లు చాలా ఆరితేరిపోయారు.

ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబు సమయంలో అయితే.. ఒక్కొక్కరు ఏడాదికి పదేసి సినిమాలు రిలీజ్ చేసేసేవారు. తమ వృత్తికి అంతగా ప్రాధాన్యతనిచ్చేవారు. ఇందుకోసం వారు కుటుంబానికి కొంత దూరంగా గడపాల్సి వచ్చినా.. వెనుకాడేవారు కాదు. ఆ తర్వాత తరం అయిన చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ లు.. ఏటా చేసే సినిమాల సంఖ్యను తగ్గించారు. 3-4 సినిమాలు మాత్రమే చేస్తూ.. కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యతనే ఇచ్చేవారు.

కానీ ఆ నెక్ట్స్ జెన్ హీరోలు మాత్రం.. రాశి కంటే వాసి ముఖ్యం అనే కాన్సెప్ట్ ని బాగా వంటబట్టించుకున్నారు. సంవత్సరానికి ఒక మూవీని రిలీజ్ చేయడమే గగనం అయిపోయింది. కానీ కుటుంబానికి మాత్రం ఎనలేని ప్రాధాన్యతను ఇస్తున్నారు ఇప్పటి సూపర్ స్టార్లు. మహేష్ బాబు అయితే ఏటా పలుమార్లు కుటుంబంతో కలిసి విదేశీ ట్రిప్స్ చేస్తుంటాడు. ఎన్టీఆర్ కూడా తన కొడుకు, భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వెళుతూ ఉంటాడు. రామ్ చరణ్ కూడా తన భార్యతో కలిసి టూర్స్ వెళుతూనే ఉంటాడు.

అయితే.. ఇలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదే అయినా.. ఒక్కోసారి వీరి టూర్స్ కారణంగా.. సినిమా షెడ్యూల్స్ కు బ్రేక్ వేయాల్సి వస్తోందనే ఆరోపణలున్నాయి. దీంతో నిర్మాతలకు బడ్జెట్ పెరుగుతోందని టాక్. అయినాసరే. కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే స్టార్ హీరోల ఆలోచనను కొట్టిపారేయలేం.