Begin typing your search above and press return to search.
పక్కా ప్లానింగ్ తో వెళ్తున్న టాలీవుడ్ యువ హీరోలు...!
By: Tupaki Desk | 4 Oct 2020 9:00 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోల నుంచి ప్రస్తుతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అయితే వారి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇంతకముందు వారి నుంచి రెండేళ్లకు ఒకటి వచ్చేది. అయితే యువ హీరోలు మాత్రం అలా లేరు. ఏడాదికి ఎన్ని సినిమాలు పాజిబుల్ అయితే అన్ని సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పటిలా హీరోలు ఇప్పుడు స్టోరీల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో వర్తమాన రచయితలు దర్శకులు పోటాపోటీగా కొత్త కథలను సిద్ధం చేస్తున్నారు. అందుకే హీరోలు కూడా వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. అందులోనూ గత ఏడు నెలలుగా కరోనా కారణంగా సినిమాల సంఖ్య తగ్గిపోయినా.. స్టోరీలు మాత్రం ఎక్కువగా వచ్చాయి. ఫిలిం మేకర్స్ అందరూ కరోనా సమయాన్ని కొత్త కథలను రాసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఈ నేపథ్యంలో యువ హీరోలు కూడా ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కి కర్చీఫ్ వేసి పెట్టుకుంటున్నారు.
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టక్ జగదీష్' చిత్రాన్ని రీ స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో నటించనున్నాడు. ఇదే క్రమంలో వివేక్ ఆత్రేయతో ఓ సినిమా.. శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేయనున్నాడు. వీటితో పాటు 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' దర్శకుడు స్వరూప్.ఆర్.ఎస్.జె తో ఓ ప్రాజెక్టు చేయనున్నారని సమాచారం. ఇక యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరీ' చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా అనౌన్స్ చేశాడు. దీంతో పాటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరియు నందిని రెడ్డి ల స్టోరీలకు కూడా చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైవిధ్యమైన చిత్రాల్లో నటించాడని ఆసక్తి చూపే చైతన్య.. 'లూజర్' అనే వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన అభిలాష్ ని టాలీవుడ్ కి పరిచయం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అలానే యువ దర్శకుడు వెంకీ అట్లూరి చైతూ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామా స్టోరీని సిద్ధం చేసాడని తెలిసింది.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు విజయ్. వీటితో పాటు శివ నిర్వాణ మరియు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ల ప్రాజెక్ట్స్ కూడా విజయ్ లైన్లో పెట్టాడని సమాచారం. మరో యువ హీరో శర్వానంద్ కూడా వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమాతో పాటు.. ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' చిత్రాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. యూత్ స్టార్ నితిన్ 'రంగ్ దే' కంప్లీట్ అయిన వెంటనే మేకర్లపాటి గాంధీ దర్శకత్వంలో 'అంధాదున్' తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నాడు. వీటితో పాటు చంద్రశేఖర్ ఏలేటితో 'చెక్' మరియు కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' సినిమాలు చేయనున్నాడు. నిఖిల్ సిద్దార్థ్ - అఖిల్ అక్కినేని - నాగశౌర్య వంటి యువ హీరోలు కూడా వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టారు. అయితే స్టార్ హీరోల కంటే వేగంగా సినిమాలు చేస్తారు కాబట్టే దర్శక నిర్మాతలు యంగ్ హీరోలతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.