Begin typing your search above and press return to search.

నిర్మాతగా మారబోతున్న మరో యంగ్ హీరో

By:  Tupaki Desk   |   7 July 2017 6:46 AM GMT
నిర్మాతగా మారబోతున్న మరో యంగ్ హీరో
X
ఓ పెద్ద బ్యానర్ లో వచ్చిన సినిమాతో కెరీర్ గ్రాఫ్ పెంచుకున్న ఓ యంగ్ హీరో, ఆ తరువాత వరుస విజయాలు సాధిస్తూ స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు. ఈ హీరోగారి స్టార్ ఎంతగా తిరిగిదంటే, తాజాగా విడుదలైన తన సినిమాకి ప్రమోషన్స్ కి కూడా సరిగా రాలేనంత బిజీగా కెరీర్ సాగుతోంది.

ఉన్న సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వచ్చే వరకు నెక్ట్స్ సినిమా కన్ఫామ్ చేయకుండా దర్శకనిర్మాతల్ని చుట్టూ తిప్పుకునే ఆ హీరోగారు ఇప్పడు నిర్మతగా కూడా మారబోతున్నాడని తెలిసింది. కాల్షీట్స్ ఇస్తే పెట్టుబడి పెట్టే నిర్మాతలు ఉండి కూడా స్వయంగా ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవ్వడం చాలా రిస్క్ అని ఆ హీరోగారి సన్నిహితులు వాపోతున్నారు.

అయితే ఎవరి మాటల్ని లెక్కచేయకుండా ప్రొడక్షన్ హౌస్ పెట్టేందుకు ఆ కుర్ర హీరో సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే వరంగల్ కి చెందిన ఓ అమ్మాయిని హీరోయిన్ గా కన్ఫామ్ చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాదు, ప్రొడక్షన్ హౌస్ పేరు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, హీరోయిన్ తో కన్ఫామ్ చేసే వరకు ప్రతి పనిలో ఆ హీరోగారు ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలిసింది. ఈ పనుల బిజీతోనే తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గోలేదని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు.