Begin typing your search above and press return to search.

'సిక్స్ ప్యాక్' ఫోటోతో సర్ప్రైజ్ చేసిన టాలీవుడ్ యువహీరో!

By:  Tupaki Desk   |   16 Feb 2021 6:36 PM IST
సిక్స్ ప్యాక్ ఫోటోతో సర్ప్రైజ్ చేసిన టాలీవుడ్ యువహీరో!
X
తెలుగు ఇండస్ట్రీలో ఆర్ఎక్స్100 మూవీతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న యువహీరో కార్తికేయ. ఆర్ఎక్స్100 ఒక్క మూవీతోనే తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ఎక్స్100 అనేది కార్తికేయకు ఫస్ట్ మైలురాయిగా నిలిచింది. ఆ మూవీతో ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అందుకున్నాడు కార్తికేయ. ఆ మూవీ తర్వాత వరుసగా హిప్పీ, గుణ369, 90ఎంఎల్ సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. ఓవైపు కార్తికేయ హీరోగా మాత్రమే కాకుండా నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ వేషంలో మెప్పించాడు. అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో కూడా కార్తికేయ విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం కార్తికేయ అవకాశాలను బాగానే క్యాచ్ చేసుకుంటున్నాడు.

మధ్యలో ఊహించని విధంగా గీతాఆర్ట్స్2 బ్యానర్ లో 'చావుకబురు చల్లగా' సినిమా వచ్చి ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'చావుకబురు చల్లగా' మూవీతో కౌశిక్ పెగళ్ళపాటి అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా కార్తికేయ సిక్స్ ప్యాక్ బాడీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ వేదికగా కార్తికేయ పోస్ట్ చేసిన తన సిక్స్ ప్యాక్ ఫోటోలో.. హీరో కండలు తిరిగిన దేహంతో చాలా కాంఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అలాగే తన ట్రైనర్ కుల్దీప్ సేతి వల్లే ఇది సాధ్యం అయిందని చెప్పుకొచ్చాడు. కార్తికేయ బాడీ మేకోవర్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. మరి ఈ సిక్స్ ప్యాక్ బాడీ అజిత్ సినిమా కోసమేనా! అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం కార్తికేయనే చెప్పాల్సి ఉంది.