Begin typing your search above and press return to search.

నిన్నుకోరి హిట్ ఆ హీరోకి నిద్రపట్టనివ్వడంలేదట

By:  Tupaki Desk   |   13 July 2017 12:19 PM IST
నిన్నుకోరి హిట్ ఆ హీరోకి నిద్రపట్టనివ్వడంలేదట
X
షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు ఓ యంగ్ హీరో. వరుస హిట్లు రావడంతో పరిశ్రమలో ఉన్న పెద్ద బ్యానర్లు ఆ హీరోగారి డేట్లు కోసం క్యూలు కట్టేశాయి. దీంతో కాస్త యాటిట్యూడ్ మార్చిన ఆ హీరోకి మళ్లీ తన తప్పు తెలుసుకునే లోపు కెరీర్ గాఢీ తప్పేసింది. వరుస ఫ్లాపులు పలకరించడంతో ప్రస్తుతం ఆ యంగ్ హీరో ఏం చేయాలో తెలియని ఆయోమయ పరిస్థితిలో ఉన్నాడని సమాచారం.

కథలు సెలక్షన్ పై ఏ మాత్రం పట్టు లేని ఆ కుర్ర హీరోని సరైన దారిలో పెట్టేందుకు అతడి సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. కొత్త కథలు విని వాటిని ఓకే చేసేందుకు ఆ హీరోగారు పర్శనల్ గా ఓ వ్యక్తిని అపాయింట్ చేసుకున్నాడని, ఆ అసిస్టెంట్ ఓకే చేస్తేనే హీరోగారు కథ వింటున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాజాగా నానితో హిట్ కొట్టిన కొత్త దర్శకుడు శివనిర్వాణ తన కథను గతంలో ఆ హీరోగారికి చెప్పడానికి వెళ్తే రెండు లైన్లు విని ఏం చెప్పకుండా లేచి వెళ్లిపోయాడని, అలా తన వద్దకు కథ చెప్పడానికి వచ్చిన చాలా మంది దగ్గర అదే రీతిన ప్రవర్తించాడని టాక్. తీరా తను రిజెక్ట్ చేసిన కథ ఇప్పుడు బంపర్ హిట్ అవ్వడంతో ఆ హీరోగారికి నిద్ర పట్టడంలేదట. మరి ఇప్పటికైన ఆ హీరోగారు నింగి వదిలి నేల మీద సాము చేస్తే మంచిదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి వారి మాటలను ఆ హీరోగారు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటాడో చూడాలి.