Begin typing your search above and press return to search.

ఆ కుర్ర హీరో అంత గీర చూపిస్తున్నాడా?

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:31 PM GMT
ఆ కుర్ర హీరో అంత గీర చూపిస్తున్నాడా?
X
టాలీవుడ్ లో ఓ కుర్ర హీరో ఉన్నాడు. ప్రయోగాత్మక సినిమాలు తీస్తాడనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం ఓ హారర్ థ్రిల్లర్ చేస్తున్న ఇతను.. ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు. ఇతని దగ్గరకు ఓ ఔత్సాహిక ఫిలింమేకర్ ను రిఫర్ చేశాడో సెలబ్రిటీ. అసలు కథ ఇక్కడమే మొదలైంది.

అపాయింట్ మెంట్ తీసుకుని మరీ ఉదయాన్నే 10 గంటలకు అతని ఇంటికి ఫిలింమేకర్ వెళ్లగా.. ఓ అర్జంట్ పని మీద వెళ్తున్నానంటూ వెయిట్ చేయమన్నాడో హీరో. ఒంటి గంటకు ఇంటికొచ్చి లంచ్ చేసే వరకు ఆగమని చెప్పాడు. ఆ తర్వాత కథ వినడం మొదలు పెట్టి.. అరగంట కాగానే మళ్లీ పనుంది వెళ్లొస్తానని చెప్పి హీరో తుర్రుమన్నాడు. రాత్రి 10 గంటల వరకూ వెయిట్ చేసి చివరకు విసుగొచ్చేసి బైట పడ్డ ఆ ఫిలిం మేకర్.. ఈ తతంగాన్నంతా ఆ సెలబ్రిటీకి చెప్పుకున్నాడు.

ఇది తనకు అవమానంగా భావించిన ఆ సెలబ్రిటీ.. మరోసారి ఆ హీరో గడప తొక్కద్దని సలహా ఇచ్చాడట. బాగా దగ్గరి వాళ్లతో కూడా ఈ కుర్రాడు ఇలాగే ప్రవర్తిస్తాడని టాక్. స్టార్ హీరో స్టేటస్ వచ్చేసిందనే భ్రమలో బతికేస్తుంటాడని కూడా అంటారు. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో నెట్టుకురావడం కష్టమంటున్నారు సినీ పెద్దలు. ఇప్పటికైనా తన ఇగో.. గీర లాంటివి వదిలిపెడితేనే కెరీర్ గాడిలో పడే ఛాన్స్ ఉంటుందని తెలుసుకుంటాడో లేదో!