Begin typing your search above and press return to search.

కామెంట్‌: రుద్రమదేవి గెలుపుతో పరిపూర్ణం

By:  Tupaki Desk   |   13 Aug 2015 5:55 PM GMT
కామెంట్‌: రుద్రమదేవి గెలుపుతో పరిపూర్ణం
X
ఈ ఏడాది సెకండాఫ్‌ ప్రారంభం అదిరింది. ఇప్పటికే రెండు భారీ సినిమాలు ఊహించిన దానికంటే పెద్ద విజయాలు అందుకున్నాయి. బాహుబలి ఇండియాలోనే నంబర్‌ -1 వసూళ్లతో సరికొత్త రికార్డులు ఆవిష్కరించింది. నెలరోజుల తర్వాత కూడా ఈ సినిమా ఇంకా హౌస్‌ ఫుల్స్‌ తో కొనసాగుతోంది. అలాగే రీసెంటుగా రిలీజైన మహేష్‌ శ్రీమంతుడు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఈ సినిమా రిలీజ్‌ రోజునుంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుని కలెక్షన్ల రికార్డుల్ని కొల్లగొడుతోంది. ఈ రెండు సినిమాలు ఇచ్చిన శుభారంభాన్ని ఇక ముందు రాబోతున్న సినిమాలు కొనసాగిస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికిప్పుడు రుద్రమదేవి 3డి లైన్‌ లో ఉంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 4న రిలీజవుతోంది. చరిత్ర నేపథ్యంగా తెరకెక్కిన చిత్రమిది. కాకతీయుల కాలాన్ని తెరపై చూపిస్తున్నారు. అందునా దేశంలోనే తొలి హిస్టారికల్‌ 3డి సినిమాగా పేరొచ్చింది. అనుష్క, అల్లు అర్జున్‌, రానా వంటి స్టార్స్‌ నటించారు, గుణశేఖర్‌ పనితనం ప్రతిఫలిస్తుందన్న నమ్మకం ఉంది.. కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. రుద్రమదేవి విజయంతో సక్సెస్‌ పరిపూర్ణమవుతుందని అంతా భావిస్తున్నారు. అంతే కాకుండా కిక్‌2, చరణ్‌-వైట్ల మూవీ, అఖిల్‌ సినిమా.. ఇలా భారీ సినిమాలు లైన్‌ లో ఉన్నాయి. కాబట్టి ఈ ఏడాది విజయాల శాతం బావుంటుందనే అంతా అంచనా వేస్తున్నారు.