Begin typing your search above and press return to search.

పృథ్వీని అలా బెదిరించింది ఎవరు?

By:  Tupaki Desk   |   13 Dec 2015 4:21 AM GMT
పృథ్వీని అలా బెదిరించింది ఎవరు?
X
ఓ పక్క ‘శంకరాభరణం’లో పర్సంటేజ్ పరమేశ్వరన్ చెలరేగిపోతుండగా.. ఇంతలోనే ‘బెంగాల్ టైగర్’తో కలిసి ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప కూడా వచ్చేశాడు. రెండు పాత్రల్లోనూ చెలరేగిపోతున్నాడు 30 ఇయర్స్ పృథ్వీ. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అతనే. బ్రహ్మానందం ఫేడవుట్ అవుతున్న సమయంలోనే పృథ్వీ రైజ్ అవుతుండటంతో టాలీవుడ్ లో వీళ్లిద్దరి గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలోనే చక్రి అనే యువ దర్శకుడితో రవితేజ చేయబోయే సినిమాలో ఓ పాత్ర కోసం ముందు బ్రహ్మిని అనుకుని.. ఆ తర్వాత పృథ్వీని తీసుకున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది.

దీంతో బ్రహ్మి పాత్రల్ని తన్నుకుపోతున్నట్లున్నారే అని సూటిగా పృథ్వీని అడిగేశారు విలేకరులు. దీనికి ఎవరి అవకాశాల్ని ఎవరూ లాగేసుకోలేరని బదులిచ్చాడు పృథ్వీ. ఐతే తన గురించి మీడియాలో ఈ మధ్య ఎక్కువగా వార్తలొస్తుండటం మీద మాత్రం ఓ పెద్ద మనిషి బెదిరించేలా మాట్లాడాడని చెప్పాడు పృథ్వీ. ‘‘ఏంట్రా మీడియా వాళ్లతో వార్తలు రాయించుకుంటున్నట్లున్నావేంటి అని ఆ పెద్ద మనిషి అడిగాడు. అయినా ఇక్కడ ఒకరు రాయమంటే ఎవరూ రాయరని చెప్పాను. ఒక్క చెప్పుకోదగ్గ పాత్ర అయినా చేస్తానా అని ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన వాడిని. దేవుడి దయ వల్ల ఇంత కాలానికి నా దశ తిరిగింది. లౌక్యం తర్వాత నన్ను నమ్మి దర్శకులు క్యారెక్టర్లు ఇస్తున్నారు’’ అని చెప్పాడు పృథ్వీ. ఇంతకీ పృథ్వీని వార్తలు రాయించుకుంటున్నావా అని బెదిరించిన పెద్ద మనిషి ఎవరన్నది ఇప్పుడు ప్రశ్న.