Begin typing your search above and press return to search.

ఆ ప్రొడ్యూసర్ ఆధిపత్యం ఎక్కడికో వెళ్ళనుందా?

By:  Tupaki Desk   |   2 Nov 2017 11:30 PM GMT
ఆ ప్రొడ్యూసర్ ఆధిపత్యం ఎక్కడికో వెళ్ళనుందా?
X
ప్రస్తుతం టాలీవుడ్లో 'ఆ నలుగురు' అనే పదం ఎవరిని ఉద్దేశించి అన్నా కూడా.. అసలు ఇక్కడ మాత్రం ధియేటర్లు దొరకాలంటే ఆ నలుగురిలో ఒకరి అండ ఉండాల్సిందే. లేదంటే ధియేటర్లు దొరకవ్. అలా దొరకనప్పుడు సినిమాకు ఎంత బ్రహ్మాండమైన టాక్ వచ్చినా వేస్టే.

అందుకే మన దగ్గర ఒక సినిమాకు టీజర్లతో ట్రైలర్తో ఎంత మంచి హైప్ వచ్చినా.. ఆ నలుగురిలో ఒకరిని కొనుక్కోమంటూ సదరు నిర్మాతలు ఎగబడుతుంటారు. ఇప్పుడు ఒక అతి పెద్ద విషయం ఏంటంటే.. ఇలా బడా నిర్మాతల్లో ఒకరికి ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన డిజిటల్ టెక్నాలజీ సినిమా స్ర్కీనింగ్ కంపెనీ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు మరో కంపెనీ (నిజానికి నెం.1 కంపెనీ) ని ఈ నిర్మాత కంపెనీ కొనేసింది. దానితో ఇప్పుడు సినిమాలు డిజిటల్ పద్దతిలో ధియేటర్లకు వెళ్ళాలన్నా కూడా ఈయన ఆజ్ఞలు ఉండాల్సిందే. అంటే ఈయన కనుసన్నల్లోనే అటు ధియేటర్లు.. ఇటు రిలీజ్ పద్దతులు నడుస్తాయి అనమాట.

ఆ లెక్కన చూసుకుంటే.. ఈ బడా ప్రొడ్యూసర్ ఆధిపత్యం వేరే స్థాయికి వెళుతున్నట్లే. అయితే సదరు ప్రొడ్యూసర్ మాత్రం అందరికీ అన్నీ అందుబాటులో ఉండేలా చూసుకుని.. ఆప్తులనీ కొత్తాళ్ళనీ పెద్దోళ్లని చిన్నోళ్ళని ఒకేలా చూస్తాడని ఆశిద్దాం.