Begin typing your search above and press return to search.

అగ్ర నిర్మాత కార్ యాక్సిడెంట్!

By:  Tupaki Desk   |   22 Oct 2018 5:19 AM GMT
అగ్ర నిర్మాత కార్ యాక్సిడెంట్!
X
టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ - ద‌గ్గుబాటి సురేష్ బాబు కార్ సికింద‌రాబాద్- ఖార్కానా ఏరియాలో ప్ర‌మాదానికి గురైంది. డ్రైవ‌ర్ ర్యాష్ డ్రైవింగ్ చేయ‌డంతో ఆ స‌మీపంలో వెళుతున్న యాక్టివాని ఈ కార్ ఢీకొట్టింద‌ని పోలీసులు చెబుతున్నారు. కార్ ఢీకొట్ట‌గానే యాక్టివా గాల్లో ఎగిరిప‌డింద‌ని తెలుస్తోంది. ఆ వాహ‌నంపై వెళుతున్న మ‌హిళ - పిల్ల‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

అయితే ఈ కార్‌ లో డి.సురేష్‌ బాబు ఉన్నారా లేదా? అన్న‌ది తెలియ‌రాలేదు. ఈ ప్ర‌మాదం ఖార్కానా నుంచి సికింద‌రాబాద్ వైపు వెళుతుండ‌గా జ‌రిగింది. యాక్సిడెంట్ అనంత‌రం డ్రైవ‌ర్ అక్క‌డి నుంచి పారిపోయాడ‌ని పోలీసులు చెబుతున్నారు. ఖార్కానా రోడ్‌ లో యాక్సిడెంట్ గురించి ప్ర‌స్తుతం పోలీసులు ఆరాలు తీస్తున్నారు. యాక్సిడెంట్‌ కి గురైన బాధితుల‌ను స‌మీపంలోని ఓ ఆస్ప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ యాక్సిడెంట్‌ లో మూడు సంవ‌త్స‌రాల బాబుకు తీవ్ర గాయాలు అయ్యాయ‌ని తెలుస్తోంది.

గ‌త కొంత‌కాలంగా ఊహించ‌ని ప్ర‌మాదాలు టాలీవుడ్‌ ని భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెల‌బ్రిటీల యాక్సిడెంట్ వార్త‌లు ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. తాజాగా జ‌రిగిన ప్ర‌మాదానికి సంబంధించి.. అస‌లేం జ‌రిగిందో మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.