Begin typing your search above and press return to search.

అనగనగ ఓ దర్శకుడు ఓవర్ యాక్షన్

By:  Tupaki Desk   |   21 July 2017 1:18 PM GMT
అనగనగ ఓ దర్శకుడు ఓవర్ యాక్షన్
X
లైట్స్ ఆన్ - రోల్ కెమెరా - యాక్షన్ ఈ మూడు పదాల్నే విజయ మంత్రాలుగా తప్పసు చేసే దర్శకులు ఎందరో గొప్ప దర్శకులు తెలుగు చిత్ర సీమలో ఉన్నారు. కానీ కొందరు మిడిమిడి జ్ఞానం ఉన్న దర్శకులు హడావుడికి తప్ప సినిమా తియ్యడానికి పనికి రారు. అయితే కాలం కలిసి వస్తుండటంతో ఆ కొందరు దర్శకులు తీసిన సినిమా హిట్ బాట పడుతున్నాయి. ఇలాంటి జాబితాకి కూడా అందని ఓ దర్శకుడు ఇప్పుడు తనో అగ్ర దర్శకుడనే భ్రమలో ఉంటూ గాల్లో తేలుతున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాస్త పేరున్న హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు ఏ క్రేజ్ లేని ఓ హీరోతో సినిమా తీస్తూ, దానికి భారీగా బడ్జెట్ కెటాయిస్తూ, ఓ సరి కొత్త రికార్డు సృష్టించాలని కలలు కంటున్నాడట ఆ దర్శకుడు.

తాను తీసే సినిమాతో రికార్డులు సృష్టించాలని కలలు కనడంలో తప్పులేదు కానీ ఆ దర్శకుడు మాత్రం ఆ కలల్లోనే బ్రతుకుతూ, సాటివారి అవమానించే స్ధాయికి వెళ్లిపోయాడని స్వయంగా ఆ దర్శకుడుతో పనిచేసే వారే చెప్పడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ దర్శకుడు తన సినిమాలో నటించే వారితో ప్రవర్తించే తీరు కొందరు సీనియర్ యాక్టర్లని హార్ట్ చేసిందని తెలిసింది. సీన్ ఎక్స్ ప్లేన్ చేస్తున్నప్పుడు ఆర్టిస్టుల్ని నుంచో పెట్టి, పక్కన ఉన్న ఓ స్టూల్ పై తాను కాలు పెట్టి, సీనియర్లు అనే కనీస మర్యాద - గౌరవం లేకుండా ఆ దర్శుకుడు నడుచుకుంటాడని సమాచారం. గతంలో ఓ టాప్ హీరోతో ఈ దర్శకుడు సినిమా చేస్తున్నప్పుడు ఓ సీనియర్ ఆర్టిస్ట్ తో ఇలానే బిహేవ్ చేసాడని, సినిమా సినిమాకి ఆ దర్శకుడు ఓవర్ యాక్షన్ - హడావుడి పెరిగిపోతున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. మరి లక్ కొద్దీ సక్సెస్ ట్రాక్ లో వెళ్తున్న ఆ దర్శకుడు కాస్త బుద్దిని కూడా సరైన దారిలో పెడతాడేమో చూద్దాం.