Begin typing your search above and press return to search.
బాలీవుడ్ టూ టాలీవుడ్ : ‘తెర’ వెనుక డ్రగ్స్ మాఫియా?
By: Tupaki Desk | 7 Sept 2020 12:00 PM ISTసుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు తాజాగా డ్రగ్స్ రాకెట్‌ను వెలుగులోకి తెచ్చారు. సుశాంత్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వ్యవహారం అంతా బయట పడింది. బాలీవుడ్, శాండిల్‌వుడ్‌తో ముడిపడి ఉన్న డ్రగ్స్ సెగ కాస్త ఇప్పుడు టాలీవుడ్‌కూ అంటుకోబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లోనూ పదేళ్లు గా డ్రగ్స్ ఆనవాళ్లు నడుస్తున్నాయి. అప్పుడప్పుడు అడపాదడపా పోలీసు, ఎక్సైజ్ అధికారుల హడావుడి తప్ప పెద్ద ఎత్తున చర్యలు మచ్చుకైనా కనిపించవు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రతిచోటా ఇండస్ట్రీ లో డ్రగ్స్ వినియోగిస్తారని పోలీసులే చెబుతున్నా.. వారిని పట్టుకోవడంలో.. పట్టించుకోవడంపై మాత్రం శ్రద్ధ పెట్టరు.
సుశాంత్ సింగ్ కేసులో ‘అనుబంధంగా’వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఓ నైజీరియన్‌ను కూడా అరెస్టు చేశారు. సినీరంగానికి చెందిన వారి నుంచి శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 3 వరకు పెడ్లర్స్ మంచి బిజినెస్ చేస్తుంటారని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్ కాల్స్‌పై వచ్చే ఆర్డర్స్ ఆధారంగా పరిచయస్తులకు మాత్రమే విక్రయిస్తుంటారు. నగరంలోని పబ్స్‌తో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్ లు, రిసార్టుల్లో జరిగే రేవ్ పార్టీల్లో వీటి వినియోగం ఎక్కువ.
అయితే.. ప్రధానం గా చెట్ల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కోటిక్ సబ్‌స్టాన్సస్. ప్రయోగ శాలల్లో తయారు చేసే సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్. గాంజ (గంజాయి), ఓపియం (నల్లమందు), కొకైన్‌లతో పాటు గాంజ ద్వారా ఉత్పత్తి చేసే చెరస్, హషీష్ ఆయిల్, బంగ్, ఓపియం ద్వారా ఉత్పత్తి అయ్యే బ్రౌన్ షుగర్, హెరాయిన్ .. ఇవన్నీ నార్కోటిక్స్ కిందకి వస్తాయి. కెటామిన్, ఎపిడ్రిన్, పెథిడిన్ తదితరాలు సైకోట్రోపిక్స్ కోవకు చెందుతాయి. సినీరంగం లో నార్కోటిక్స్ వినియోగమే ఎక్కువ. వీటిలోనూ గాంజ, చెరస్, కొకైన్‌ను విచ్చలవిడిగా వాడుతుంటారు. గాంజ ఉత్పత్తులు ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నాయి. అక్కడ పండే గంజాయితో పాటు చెరస్, హషీష్ ఆయిల్‌కు సినీ రంగంలో మంచి డిమాండ్ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఓపియం సహా దాని ఉత్పత్తులైన బ్రౌన్ షుగర్, హెరాయిన్‌ల చలామణి తక్కువ. ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీ, చండీగడ్‌ల్లో డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వీరి నెట్‌వర్క్‌లో నైజీరియన్లదే కీలకపాత్ర.
డ్రగ్స్ వినియోగం టాలీవుడ్‌కు బాలీవుడ్ నుంచే పాకింది. బాలీవుడ్‌లో 1970ల్లోనే ఈ డ్రగ్స్ వాడకం వెలుగు చూసింది. అప్పటి నటీమణులు పర్వీన్ బాబీ, ప్రోతిమా బేడీ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. సంజయ్‌దత్ సైతం ఈ వ్యవహారంలో వివాదాస్పదుడిగా ఉన్నాడు. ఫర్దీన్ ఖాన్ కొకైన్‌ను కలిగి ఉండి 2001లో ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చిక్కాడు. అప్పుడు పట్టుబడిన డ్రగ్ డీలర్ కరీమ్‌షేక్ అనేక మంది స్టార్ల పేర్లు బయటపెట్టాడు. నటుడు విజయ్‌రాజ్ డ్రగ్స్ తరలిస్తూ అబుధాబి పోలీసులకు చిక్కాడు. ఈ డ్రగ్స్ వినియోగ, విక్రయ జాడ్యం ఇప్పుడు టాలీవుడ్‌నూ పట్టిపీడిస్తోంది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన ఉగాండా జాతీయులు ప్రాట్రిక్, ఐబేర్‌లు... టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నైజీరియా జాతీయుడు ఒకాచోలు కొకైన్ స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరి కస్టమర్లలో 80 శాతం సినీ రంగానికి చెందిన నేటి వారే.
ప్రముఖ నటుడు రవితేజ సోదరులైన బి.రఘుబాబు, భరత్‌రాజ్‌ను వెస్ట్‌జోన్ స్పెషల్ పార్టీ పోలీసులు గతంలో ఓసారి పట్టుకున్నారు. వారిని విచారించగా చాలా మంది సినీ తారల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్లు, లేడీ యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులను విచారించారు. కొద్ది రోజులు హడావిడి చేసిన పోలీసులు తర్వాత కేసును పక్కన పడేశారు.