Begin typing your search above and press return to search.

దేవ‌ర‌కొండకు ఇండ‌స్ట్రీ మ‌ద్ధ‌తు!

By:  Tupaki Desk   |   5 May 2020 9:00 AM IST
దేవ‌ర‌కొండకు ఇండ‌స్ట్రీ మ‌ద్ధ‌తు!
X
క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ కార్మికులు స‌హా మెజారిటీ ప్ర‌జ‌లు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌నీస నిత్యావ‌స‌రాలు తిండికి లేక ఇబ్బందిప‌డే ధైన్యం నెల‌కొంది. అలాంటి వారి కోసం మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ట్ర‌స్ట్ ను స్థాపించి కొంత‌వ‌ర‌కూ స‌హాయం అందిస్తున్నారు.. అలాగే ఇండ‌స్ట్రీ హీరోలు.. ప్ర‌ముఖులంతా స్పందించి ధాతృసాయం అందించిన సంగ‌తి తెలిసిందే. అయితే రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇలాంటి క‌ష్ట‌కాలంలో స‌రిగా స్పందించ‌లేద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ క్ర‌మంలోనే దేవ‌ర‌కొండ త‌న‌వంతు సాయంగా దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్ ని స్థాపించి మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో అవ‌స‌రార్థుల‌కు స‌హాయం చేస్తున్నారు. నిత్యావ‌స‌రాలు కొనుక్కునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారు.

దీనికి ప్ర‌జ‌ల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇక‌పోతే దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్ పై కొంద‌రు దుష్ప్ర‌చారం చేసారని .. త‌న ఇమేజ్ కి డ్యామేజ్ చేస్తూ ప్ర‌చారం సాగించార‌ని దేవ‌ర‌కొండ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తూ ఒక వీడియోని మీడియాకి రిలీజ్ చేశారు. వీలుంటే మంచి చేయండి .. ఫేక్ వార్త‌ల్ని సృష్టించ‌వ‌ద్ద‌ని కోరారు. ఇక దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్ కి అత్య‌ధిక రిక్వస్టులు రావ‌డంతో అంద‌రికీ సాయం అందించ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని నిధి కోసం విరాళాలు సేక‌రిస్తున్నామ‌ని దేవ‌ర‌కొండ తెలిపారు. ప్ర‌స్తుతానికి రిక్వ‌స్టులు ఆపేశామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కూ అంద‌రికీ సాయం అందిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ఫౌండేషన్‌పై కొందరు ఫేక్ వార్తలు ప్ర‌చారం చేయ‌డంతో విరాళాల ధాత‌లు.. విరాళం ఇవ్వాల‌నుకున్న వారు నొచ్చుకుంటార‌ని ఇలా మీడియా ముఖంగా ఆ ఫేక్ వార్తలను ఖండించారు. త‌ప్పుడు వార్త‌ల‌ను ఖండిస్తూ ఓ వీడియోని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. దీనికి సూపర్ స్టార్ మహేష్ మద్దతు తెలుపుతూ.. ఇలాంటి ఫేక్ ని పుట్టించేవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. మహేష్ స‌హా కొర‌టాల శివ ఇత‌ర ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు దేవ‌ర‌కొండ‌కు మ‌ద్ధ‌తు ప‌లికారు. రవితేజ- కొరటాల శివ- హరీష్ శంకర్- అనిల్ సుంకర- వంశీ పైడిపల్లి- క్రిష్ జాగర్లమూడి- మధుర శ్రీధర్- రానా దగ్గుబాటి- రాశీ ఖన్నా వంటి వారందరూ విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.