Begin typing your search above and press return to search.

టాలీవుడ్ సందడి మొదలైంది

By:  Tupaki Desk   |   16 March 2018 5:53 AM GMT
టాలీవుడ్ సందడి మొదలైంది
X
గత ఏడాది నవంబర్ లో సినిమా థియేటర్స్ కొంచెం కాలిగా కనిపించిన సంగతి తెలిసిందే. అందరు పండగలనే టార్గెట్ చేయడంతో కొన్ని వారలు గ్యాప్ వచ్చింది. మళ్లీ డిసెంబర్ లో ఉపందుకొని ఫిబ్రవరి వరకు కొంచెం సందడిగానే ఉండేది. అయితే ఆ తరువాత చాలా వరకు యువతకు పరీక్షలు మొదలవ్వడంతో టాలీవుడ్ బ్రేక్ తీసుకుంది. మొత్తంగా ఓ నాలుగు వారల తరువాత పరీక్షలు పూర్తవ్వడంతో అసలు వాతావరణం మొదలైంది.

కొంచెం క్రేజ్ ఉన్న సినిమాలు వస్తే.. సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయవచ్చు అని చాలా మంది అనుకుంటారు. అందుకే కిర్రాక్ పార్టీ టీమ్ ఒపిక పట్టి ఈ శుక్రవారం సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. నిఖిల్ సినిమాలకు గత కొంత కాలంగా మంచి క్రేజ్ అందుతోన్న సంగతి తెలిసిందే. అందులోను కాలేజ్ క్యాంపస్ కథ కావడంతో యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ సినిమాతో పాటు ఐతే 2.0 - దండుపాళ్యం 3 - కర్తవ్యం సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.

నయనతార నటించిన డబ్బింగ్ సినిమా కర్తవ్యం తమిళ్ లో మంచి హిట్ అయ్యింది. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ గత కొంత కాలంగా సినిమాను రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు. ఫైనల్ గా ఈ రోజుకు సెట్ అయ్యింది. ఇక దండుపాళ్యం 3 కోసం స్పెషల్ గా ఓ వర్గం వారు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఐతే స్పూర్తితో తెరకెక్కిన ఐతే 2.0 సినిమాపై కూడా అంచనాలు ఓ విధంగా బాగానే ఉన్నాయి. మల్టిప్లెక్స్ ఆడియెన్స్ కి సినిమా తప్పకుండా నచ్చుతుందనే టాక్ వస్తోంది. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ ఆదరణని అందుకుంటుందో చూడాలి.