Begin typing your search above and press return to search.

మ‌న స్టార్లు చెన్న‌య్ వెళ్లి ఓట్లేస్తారా?

By:  Tupaki Desk   |   6 Oct 2015 4:09 AM GMT
మ‌న స్టార్లు చెన్న‌య్ వెళ్లి ఓట్లేస్తారా?
X
అప్ప‌ట్లో మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల వేళ ముర‌ళీ మోహ‌న్‌ కి వ్య‌తిరేకంగా మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టుకున్నాడు రాజేంద్రప్ర‌సాద్‌. మెగా అండ‌దండ‌ల‌తో మా ఎన్నిక‌ల్లో గెలుపొందాడు. ఇప్పుడు అదే తీరుగా కోలీవుడ్‌ లోని న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల‌కు మెగా స‌పోర్ట్ అవ‌స‌రం అని భావిస్తున్నారు. హీరో విశాల్ రెడ్డి నేరుగా మెగా స్టార్ చిరంజీవిని క‌లిసి త‌న‌కి స‌పోర్ట్ ఇవ్వాల్సిందిగా కోర‌నున్నార‌ట‌. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకి వెళితే...

న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల హీట్ రోజు రోజుకి పెరుగుతోంది. కోలీవుడ్ స‌ర్వ‌త్రా ఈ ఎల‌క్ష‌న్స్ గురించే డిష్క‌స‌న్ సాగుతోంది. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల యుద్ధం న‌టుడు, నిర్మాత శ‌ర‌త్‌ కుమార్‌ కి- హీరో విశాల్ కి మ‌ధ్య జ‌రుగుతోంది. శ‌ర‌త్‌ కుమార్ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు. అత‌డికి వ్య‌తిరేకంగా నాజ‌ర్ న‌డిగ‌ర సంఘం అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు. నాజ‌ర్‌ కి స‌పోర్టుగా విశాల్ - కార్తీ కీల‌క‌మైన ప‌ద‌వులకు పోటీ చేస్తున్నారు. విశాల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి, కార్తీ ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు.

చిరంజీవి - బాల‌య్య స‌హా సీనియ‌ర్ న‌టీన‌టుల‌కు న‌డిగ‌ర సంఘంలో స‌భ్య‌త్వం ఉంది. 3500 మంది స‌భ్యుల్లో టాలీవుడ్ నుంచి 500 మంది మెంబ‌ర్స్ ఉన్నారంటే చూస్కోండి మరి. వీళ్ల స‌పోర్ట్ ఈ ఎన్నిక‌ల్లో కీల‌కం కానుంది. ఈ ఓట్ల‌న్నిటినీ గుప్పిట ప‌ట్ట‌గ‌లిగితే గెలుపు త‌థ్యం అని విశాల్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకే త్వ‌ర‌లోనే మెగాస్టార్ చిరంజీవి - న‌ట‌సింహా బాల‌య్య‌ల‌ను క‌లిసి స‌పోర్ట్ ఇవ్వాల్సిందిగా అభ్య‌ర్థించ‌నున్నాడుట‌. అయితే మ‌న స్టార్లు మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లోనే పాల్గొన‌లేదు. లోక‌ల్ ఎన్నిక‌ల‌కే ఓటు వేసేందుకు రాలేదు. మ‌రి చెన్న‌య్ వెళ్లి ఓటు వేసి విశాల్ పానెల్‌ ని, నాజ‌ర్‌ ని గెలిపిస్తారంటారా? చూద్దాం.