Begin typing your search above and press return to search.

దుబాయ్ నే టార్గెట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్

By:  Tupaki Desk   |   30 Nov 2020 11:15 AM IST
దుబాయ్ నే టార్గెట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్
X
ఓవైపు అందాల క‌థానాయిక‌లంతా మాల్దీవుల విహారానికి ప్రాధాన్య‌త‌నిస్తుంటే .. మ‌న హీరోలంతా దుబాయ్ విహారానికి అక్క‌డ షూటింగుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ఇలానే ఎందుకు? అంటే క‌రోనా ఫ్రీ దేశాలుగా గ‌ల్ఫ్ కి పేరుంది. దుబాయ్ యుఏఈలో కంట్రోల్ బావుంది. అలాగే సింగ‌పూర్ స‌హా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో క‌రోనాను బాగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. సింగ‌పూర్ లో ప్ర‌స్తుతం జీరో కేసుల‌తో ప్ర‌శాంతంగా ఉందిట‌. దుబాయ్ లోనూ ఈ స‌మ‌స్య అంత పెద్ద‌గా లేదు. యుఏఈలో గ‌రిష్టంగా వెయ్యి కేసుల్ని మించ‌నేలేదు. దీంతో అక్క‌డ ప్ర‌జ‌ల‌కు రిలీఫ్ దొరికింది. అందుకే మ‌న స్టార్లు దుబాయ్ వెళ్లేందుకు ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌.

ప్ర‌స్తుతం దుబాయ్ నుంచి ఇటీవ‌లే మ‌హేష్ ఫ్యామిలీ వెకేష‌న్ ముగించి ఇండియాకి తిరిగి వ‌చ్చారు. అలాగే దుబాయ్ లో నితిన్ - కీర్తి సురేష్ రంగ్ దే చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నితిన్ హ‌నీమూన్ ని కూడా దుబాయ్ లోనే ప్లాన్ చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇదిలా ఉండ‌గా.. నాగ‌శౌర్య `వ‌రుడు కావ‌లెను` చిత్రీక‌ర‌ణ‌ను దుబాయ్ లోనే ప్లాన్ చేశారు. సౌజ‌న్య ఈ చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కీల‌క స‌న్నివేశాల్ని దుబాయ్ లో చిత్రీక‌రించ‌నున్నారు. ప‌లువురు హీరోలు దుబాయ్ షూటింగుల‌ను ప్రిఫ‌ర్ చేస్తున్నారన్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.