Begin typing your search above and press return to search.

ఆ సిటీ అంటే స్టార్స్ కు భయం వేస్తోంది

By:  Tupaki Desk   |   21 Aug 2017 11:00 PM IST
ఆ సిటీ అంటే స్టార్స్ కు భయం వేస్తోంది
X
మొన్నటి దాకా టాలీవుడ్ ని గడగడలాడించిన డ్రగ్స్ వ్యవహారాన్ని ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోతున్నారు. టాలీవుడ్ కూడా కొద్దీ కొద్దిగా కొలుకుంటోంది. ఇక విచారణను ఎదుర్కొన్న తారలు కూడా జరిగింది ఒక పీడకల అనుకొని ఎప్పటిలాగానే వారి వారి షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది.

సాధారణంగా బ్యాంకాక్ లో ఎక్కువ షూటింగ్స్ జరిపే టాలీవుడ్ తారలు మళ్లీ ఆ దేశం పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడటం లేదట. షూటింగులకి వెళ్లడానికి అయినా లేదా విహార యాత్రలకు వెళ్లాలని ఎపుడో ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ ని సైతం చించి పారేసి క్యాన్సిల్ చేసుకుంటున్నారని టాక్. ఎందుకంటే డ్రగ్స్ మాఫీయా కి బ్యాంకాక్ ప్రధాన అడ్డా అని ఓ టాక్ ఉంది. అంతే కాకుండా బ్యాంకాక్ కు వెళ్లే తారలను పోలీసుల ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. దీంతో స్టార్స్ ఒక వేళ తప్పకుండా వెళ్లాలి అనే పరిస్థితి ఎదురైతే మాత్రం సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారట. ఎందుకంటే ఓడలల్లో వెళితే పాస్ పోర్ట్ పై స్టాంప్ పడదు. కేవలం ఆ దేశానికి వెళుతున్నామని ఆ దేశ సెక్యూరిటీ అధికారులకు తప్ప మరెవరికీ తెలియదట.

తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తేనే ఈ తరహాలో సినీ తారలు వెళుతున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వెళ్లినవారు కూడా వీలైనంత త్వరగా షూటింగ్స్ ను గాని ఇతర పనులను గాని త్వర త్వరగా పూర్తి చేసుకొని బ్యాంకాక్ నుంచి బయటపడుతున్నారట. ఇక విచారణను ఓ స్థాయిలో చేసిన సిట్ అధికారులు ఇప్పటిదాకా ఏ విషయాన్నీ తెలియజేయలేదు. మరి సీక్రెట్ గా ఏదైనా చేస్తున్నారా లేదో వారికే తెలియాలి. మొత్తానికి టాలీవుడ్ లో ఉన్న బిగ్ స్టార్స్ నుంచి చిన్న తరహా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు బ్యాంకాక్ షూటింగ్స్ కి దాదాపు దూరంగానే ఉన్నారని టాక్.