Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్స్ పార్టీ నైట్‌!

By:  Tupaki Desk   |   17 Aug 2022 2:30 PM GMT
టాలీవుడ్ స్టార్స్ పార్టీ నైట్‌!
X
టాలీవుడ్ లో బాలీవుడ్ త‌ర‌హాలో కాక‌పోయినా కొంత వ‌ర‌కు ప్ర‌త్యేక పార్టీలు కామ‌న్ గా జ‌రుగుతుంటాయి. అయితే స్టార్ హీరోలు మాత్రం ప్ర‌త్యేకంగా పార్టీల్లో క‌నిపించ‌రు. ఏ ఫొటోలు కూడా బ‌య‌టికి వ‌చ్చిన దాఖ‌లాలు లేవు. అయితే గ‌తంలో రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేశారు.

అదే త‌ర‌హాలో ముగ్గురు యంగ్ హీరోలు క‌లిసి మంగ‌ళ‌వారం రాత్రి పార్టీ చేసుకోవ‌డం విశేషం. ఓ కామ‌న్ ఫ్రెండ్ బ‌ర్త్ డే పార్టీ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగింది.

ఈ పార్టీలో ముగ్గురు యంగ్ హీరోలు నితిన్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ పాల్గొని చిల్ల‌య్యారు. ఓ రేంజ్ లో హంగామా చేశారు. వీరితో పాటు యువ నిర్మాత `గ‌ని` ఫేమ్ సిద్దూ ముద్ద కూడా పాల్గొన్నాడు. అంతే కాకుండా నితిన్ వైఫ్ షాలినీ, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, కాస్ట్యూమ్ డిజైన‌ర్ నీర‌జ కోన త‌దిత‌రులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి.  

వ‌రుణ్ తేజ్ న‌టించిన `గ‌ని` ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్రంగా నిరాశ ప‌రిచిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి అల్లు బాబీతో క‌లిసి సిద్దూ ముద్ద కూడా ప్రొడ్యూస‌ర్ లుగా ప‌రిచ‌యం అయ్యారు.

భారీ స్థాయిలో మేక‌ర్స్ కి `గ‌ని` న‌ష్టాల‌ని తెచ్చిపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత వ‌రుణ్ తేజ్ ..ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో ఓ భారీ యాక్ష‌న్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ఇది ఇప్ప‌టికీ సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ వుంటుందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా వుంటే హీరో నితిన్ న‌టించిన `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం` ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ నితిన్ కు ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. మెగా హీరో సాయి ధ‌రమ్ తేజ్ ప్ర‌స్తుతం హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీలో న‌టిస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో సంప‌త్ నంది ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.