Begin typing your search above and press return to search.

బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్...!

By:  Tupaki Desk   |   16 July 2020 11:00 AM IST
బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్...!
X
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస వరుస విజయాలను అందుకుంటూ తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణా రెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా కన్నేశారు. ఇక్కడ స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న దిల్ రాజు బాలీవుడ్ మీద కన్నేశారు. ఈ క్రమంలో ముందుగా నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా మరో తెలుగు సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు.

హీరో నాని నిర్మించిన 'హిట్' చిత్రాన్ని బాలీవుడ్ లో దిల్ రాజు నిర్మించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించి 'హిట్' సినిమా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. ఇప్పుడు హిందీ 'హిట్' చిత్రాన్ని రాజ్ కుమార్ రావ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో మరో నిర్మాత కుల్దీప్ రాథోర్ తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ 2021లో ప్రారంభం కానుంది. అయితే దిల్ రాజు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని డిసైడ్ అయినప్పటికీ అతను సెలెక్ట్ చేసుకున్న సినిమాల విషయంలోనే ఇండస్ట్రీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

ఎందుకంటే 'జెర్సీ' 'హిట్' రెండూ విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ తెలుగులో మాస్ ఆడియెన్స్ కి పెద్ద‌గా న‌చ్చ‌లేదు. అందుకే యావరేజ్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు యావ‌రేజ్ కంటెంట్ ఉన్న సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి దిల్ రాజు బాలీవుడ్ ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పించగలరో అని కామెంట్స్ వినిపడుతున్నాయి. దిల్ రాజు బాలీవుడ్ లో కూడా స్టార్ ప్రొడ్యూసర్ గా మారాలంటే మంచి హిట్ సినిమాని రీమేక్ చేస్తే బాగుండేది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దిల్ రాజు నిర్మాణ సంస్థ బాలీవుడ్ లో కూడా స‌క్సెస్ అవుతుందేమో చూడాలి.