Begin typing your search above and press return to search.

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స్టార్ ప్రొడ్యూస‌ర్‌?

By:  Tupaki Desk   |   10 Nov 2022 2:30 AM GMT
విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స్టార్ ప్రొడ్యూస‌ర్‌?
X
టాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ల‌లో ముందు వ‌రుస‌లో వుండే ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ పంపిణీదారుడిగానూ ఆయ‌నకు మంచి పేరుంది. కొన్ని సంద‌ర్భాల్లో భారీ లాభాల్ని తెచ్చిపెట్ట‌గా మ‌రి కొన్ని సంద‌ర్భాల్లో డిస్ట్రిబ్యూష‌న్ త‌ల‌నొప్పుల్ని కూడా తెచ్చిపెట్టి ఆయ‌న స‌హ‌నాన్ని ప‌రీక్షించిన రోజులు కూడా వున్నాయి. ఇదిలా వుంటే త్వ‌ర‌లో రిలీజ్ కానున్న ఓ త‌మిళ సినిమా దిల్ రాజుకు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

తెలుగులో రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల‌తో భారీ పొలిటిక‌ల్ డ్రామాని రూపొందిస్తూనే త‌మిళ స్టార్ హీరో, ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. త‌మిళంలో 'వారీసు'గా తెలుగులో 'వార‌సుడు'గా రూపొందుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమాల‌కు పోటీగా దిల్ రాజు బ‌రిలో దించ‌డానికి రెడీ అవుతున్నారు.

ఇదే స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌', నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర‌సింహారెడ్డి' పండ‌గ సీజ‌న్ లో రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో నైజాంలో త‌న చేతుల్లో వున్న థియేట‌ర్ల‌న్నీంటినీ 'వార‌సుడు' సినిమాకు లాక్ చేసి పెట్టుకోవాల‌ని దిల్ రాజు భావిస్తున్నాడ‌ట‌.

అది ఆయ‌న‌కు పెద్ద త‌ల‌నొప్పుల్ని తెచ్చిపెట్ట‌డం ఖాయం అని చెబుతున్నారు. ఎందుకంటే భ‌విష్య‌త్తులో మెగాస్టార్ చిరంజీవితో, బాల‌య్య‌తో సినిమాలు తీయాల‌ని దిల్ రాజు భావిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల‌ని త‌ను నిర్మిస్తున్న 'వార‌సుడు' మూవీకి లాక్ చేసి పెట్టుకుంటే భ‌విష్య‌త్తుల్లో ఇబ్బందులు త‌ప్ప‌వు. సీనియ‌ర్ న‌టులు చిరంజీవి, బాల‌య్య సినిమాల‌కు థియేట‌ర్ల త‌గ్గుతాయి. దాంతో వారి దృష్టిలో దిల్ రాజు విల‌న్ అవుతాడు.

అయితే అలా తాను విల‌న్ కావ‌డం దిల్ రాజు కు ఇష్టం లేద‌ట‌. మ‌రి ఈ విపత్క‌ర ప‌రిస్థితుల నుంచి దిల్ రాజు గ‌ట్టెక్క‌డం ఎలా? .. నొప్పింప‌క తానొవ్వ‌క అన్న‌ట్టుగా దిల్ రాజు ఈ ప‌రిస్థితి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడ‌న్న‌ది వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.