Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ కిడ్స్ 'ఫాదర్స్ డే' సెలెబ్రేషన్స్..!

By:  Tupaki Desk   |   20 Jun 2021 5:30 PM GMT
టాలీవుడ్ స్టార్ కిడ్స్ ఫాదర్స్ డే సెలెబ్రేషన్స్..!
X
సోషల్ మీడియాలో స్టార్ కిడ్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. స్టార్ కిడ్స్ అంటే వారి అల్లరి ఇంటివరకే పరిమితం కాదు. ఇంట్లో చేసే సందడి పోస్టుల రూపంలో సోషల్ మీడియా వరకు వెళ్తుంది. ఖాళీ టైంలోనే తెగ అల్లరి చేసే స్టార్ కిడ్స్.. అదే ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అంటే ముందే ఉంటారు. అందులోను స్పెషల్ డేస్ అంటే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. అలా ఎల్లప్పుడూ సందడి చేసే పిలల్లో ముందుంటారు అల్లు అయాన్, అల్లు ఆరా. వీరిద్దరూ సినీ హీరో అల్లు అర్జున్ పిల్లలు. మనకు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వీళ్ల వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి.

అల్లు అయాన్ కంటే కూడా ఆరా చాలా అల్లరి అని అర్ధమవుతుంది. తన తండ్రి బన్నీ నటించే సినిమాలలోని డైలాగ్స్, యాక్టింగ్ చేస్తూ కెమెరా కంట్లో పడుతుంటారు. ఈ ఇద్దరు అన్నచెల్లెళ్లకు నెట్టింట ఫాలోయింగ్ మాములుగా లేదు. తాజాగా ఇద్దరు కలిసి ఫాదర్స్ డే సందర్బంగా అల్లు అర్జున్ తో కలిసి కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను బన్నీ వైఫ్ స్నేహరెడ్డి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సితార అల్లరి గురించి అందరికి తెలిసిందే. వాస్తవానికి సితార సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇటు హీరోలలో తండ్రి మహేష్ బాబు క్రేజ్ టాప్ లో ఉంటుంది. సెలబ్రిటీస్ కిడ్స్ విషయంలో సూపర్ స్టార్ కూతురు సితార క్రేజ్ సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే మాటలతోనే బూరెలు వండేసే రకం సితార. గలగల మాట్లాడుతూ ఎల్లప్పుడూ తండ్రితో అల్లరి చేస్తూ కనిపిస్తుంది సితూ పాప. తాజాగా ఫాదర్స్ డే సందర్బంగా ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో సితార చిన్నప్పటి నుండి తన తండ్రితో కలిసి దిగిన ఫోటోస్ మనం చూడవచ్చు. తన తండ్రి తనతో ఆటలు ఆడుతాడని.. డాన్స్ చేస్తూ పాటలు పాడుతాడని.. ఎల్లప్పుడూ నవ్వుతూ నడిపిస్తాడని.. అయనలా ఎవరు ఉండలేరు. లవ్ యూ నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే" అంటూ మహేష్ గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం సితార పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఫాదర్స్ డే సందడిని సెలబ్రిటీల పిల్లలు వారిళ్లలో బాగానే సెలెబ్రేట్ చేసుకుంటున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.