Begin typing your search above and press return to search.

మళ్ళీ వార్తల్లోకి స్టార్ హీరోయిన్ పెళ్లి...!

By:  Tupaki Desk   |   23 Sept 2020 1:40 PM IST
మళ్ళీ వార్తల్లోకి స్టార్ హీరోయిన్ పెళ్లి...!
X
కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో పెళ్లిళ్ల హడావిడి నడిచింది. ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో మూడు పదుల వయసు దాటిపోయిన సౌత్ స్టార్ హీరోయిన్ ఒకరు పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త తెగ వైరల్ అయింది. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని.. ఇప్పటికే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని.. ఈ ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని పుకార్లు షికారు చేసాయి. దీనికి తోడు ఈ వార్తలపై అమ్మడు స్పందించకపోవడంతో అందరూ నిజమేనేమో అని అభిప్రాయపడుతున్నారు.

అయితే స్టార్ హీరోయిన్ సన్నిహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం అమ్మడికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలుస్తోంది. ప్రస్తుతం చేతినిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్న ఆ హీరోయిన్ ఫ్యామిలీ లైఫ్ లోకి ప్రవేశించడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్తోందట. తల్లిదండ్రులు కూడా తనను పెళ్లి విషయంలో ఒత్తిడి చేస్తున్నారని.. కాకపోతే ఇప్పటికే చాలా సినిమాలు సైన్ చేసి ఉండటంతో.. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచిస్తానని అంటోందట. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే స్టార్ హీరోయిన్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.