Begin typing your search above and press return to search.
డెబ్యూ ఛాన్సిచ్చాడు.. గ్యాప్ తర్వాత మళ్లీ ఊతమిస్తున్న డైరెక్టర్
By: Tupaki Desk | 29 Sept 2020 5:00 AM ISTఆ ముంబై బ్యూటీకి తొలి అవకాశం ఇచ్చాడు ఆ డైరెక్టర్. ఆరంభమే హిట్టు అందుకుంది. అందులో నటించిన ఆ ముంబై బ్యూటీతో పాటు యువహీరోకి మంచి పేరు తెచ్చింది. అటుపై ఈ అమ్మడికి కలిసొచ్చింది. వరుసగా టాలీవుడ్ సినిమాల్లో నటించింది. కానీ దురదృష్టమో ఏమో కానీ స్టార్ హీరోయిన్ రేంజుకు మాత్రం ఎదగలేక చతికిలబడిపోయింది. కాలక్రమంలో తనకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసే వాళ్లే ఇండస్ట్రీలో కరువయ్యారు.
దాంతో ఆల్మోస్ట్ కెరీర్ ఖాళీ అయిపోయింది. అయినా నిరంతరం సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో వేడెక్కిస్తూ సదరు భామ టాలీవుడ్ సర్కిల్స్ కి టచ్ లోనే ఉంది. ఇంకా ఎందుకనో ఈ అమ్మడికి అవకాశం ఇచ్చేందుకు మాత్రం వెనకాడేస్తున్నారు. అప్పట్లో మెగా కాంపౌండ్ ఆఫర్ అందుకుంది. అదే కాంపౌండ్ హీరోలు వరుసగా అవకాశాలిస్తారని భావించినా ఆశించినది జరగనేలేదు.
కానీ ఇప్పుడు మరోసారి ఈ భామకు మెగా ఆఫర్ వరించిందని ప్రచారం సాగుతోంది. తనకు తొలి సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడే తిరిగి మరోసారి తనకు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారట. అది కూడా టాప్ హీరోతో ఆఫర్ కావడంతో ఇక దశ తిరిగిపోవడం ఖాయం అన్న చర్చా సాగుతోంది. ఎంత తోడు పెట్టినా కానీ గ్లామర్ షోని మించి ఇక్కడ నటిగా నిరూపించుకుంటేనే మనుగడ. గ్లామర్ షో అనేది కొంతవరకే. మరి తాజా ఆఫర్ తో అయినా నిరూపించుకుని అమ్మడు కెరీర్ పరంగా ఎదగాల్సి ఉంటుంది. మరి అది జరిగే పనేనా?