Begin typing your search above and press return to search.

శతమానం భవతి... ఒక ఆసక్తికర కబురు

By:  Tupaki Desk   |   9 Jan 2017 1:30 PM GMT
శతమానం భవతి... ఒక ఆసక్తికర కబురు
X
ఖైదీ నెంబర్ 150 - గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి బడా సినిమాల మధ్య ధైర్యంగా రిలీజ్‌ కు రెడీ అయిపోతోంది ‘శతమానం భవతి’. ఆ రెండు సినిమాలపై ఉన్న అంచనాల సంగతి తెలిసి కూడా దిల్ రాజు వెనక్కి తగ్గట్లేదు. ఈ సినిమాపై ఆయనకున్న భరసానే ఇందుకు కారణం అంటున్నారు సన్నిహితులు. దాదాపు మూడేళ్లుగా ఈ స్క్రిప్టుతో ట్రావెల్ అవుతున్న దిల్ రాజు.. దానిపై చాలా ఇష్టం పెంచుకున్నాడని.. ఇది కచ్చితంగా ఆడే సినిమా అని నమ్మకంగా ఉన్నాడని.. ఔట్ పుట్ కూడా బాగా వచ్చిందని అంటున్నారు. ఈ సినిమాలో బోలెడన్ని ఆకర్షణలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘శతమానం భవతి’లో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కనిపిస్తారట. ఐతే వాళ్లేమీ ఈ సినిమా కోసం క్యామియో రోల్స్ ఏమీ చేయలేదు. వేర్వేరు స్టార్ హీరోల సినిమాల్లోని సన్నివేశాల్ని అతికించి.. కంటిన్యుటీ ఉండేలా ఒక సన్నివేశాన్ని తీర్చిదిద్దారట ‘శతమానం భవతి’ కోసం. ఒకరితో ఒకరు సంభాషిస్తున్నట్లుగా ఈ సన్నివేశం ఉంటుందట. దాదాపు అందరు స్టార్ హీరోల్ని రౌండప్ చేసేలా ఈ సీన్ తీర్చిదిద్దినట్లు సమాచారం. సినిమాకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో దిల్ రాజుకు మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి వాళ్లను ఇలా వాడేయడానికి అభ్యంతరం లేకపోవచ్చు. మరి ఈ సీన్ సినిమాలో ఎలా పండుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/