Begin typing your search above and press return to search.

ప్రయోగాలతో తెలుగు సినిమా ప్రభంజనాలు

By:  Tupaki Desk   |   5 May 2018 5:30 PM GMT
ప్రయోగాలతో తెలుగు సినిమా ప్రభంజనాలు
X
సినిమాలతో ప్రయోగాలు చేయడం.. ఒకప్పుడు టాలీవుడ్ పూర్తిగా మరచిపోయిన మాటలివి. ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు.. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు.. రెచ్చిపోయే హీరోయిజం.. తెలుగు సినిమాలో ఇంతకు మించి ఇంకేమీ ఉండవు అనే పరిస్థితి. ఇక్కడి నుంచి బయటకు వచ్చేందుకు కూడా స్టార్ హీరోలు ఇష్టపడేవారు కాదు.

కానీ ఫక్తు కమర్షియల్ మూవీస్ కి దాదాపుగా కాలం చెల్లిపోయిన విషయాన్ని తెలుగు స్టార్ హీరోలు బాగానే గుర్తించారు. అందుకే వరుసగా ప్రయోగాలతో కుమ్మేస్తున్నారు. ఈ సమ్మర్ లో వచ్చిన పెద్ద సినిమాలన్నీ డిఫరెంట్ మూవీస్ కావడం మరీ ఆసక్తిని కలిగిస్తోంది. మొదటగా రంగస్థలం అంటూ రామ్ చరణ్ తన రచ్చ బిగిన్ చేశాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను సరిచేసేసి.. బయ్యర్స్ అందరికీ బంపర్ ప్రాఫిట్స్ పంచిపెట్టి.. అసలు సిసలు బ్లాక్ బస్టర్ కు అర్ధం చెప్పాడు. ఆ వెంటనే భరత్ అనే నేను అంటూ మహేష్ బాబు రంగంలోకి దిగిపోయాడు. విదేశాల్లో చదువుకుని ఇండియాకి వచ్చి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి యంగ్ సీఎం పాత్రలో మహేష్ కనిపించిన తీరు అద్భుతం. అమ్మిన రేట్లు భారీగా ఉండడంతో.. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా బ్రేక్ఈవెన్ సాధించాల్సి ఉంది.

ఇప్పుడు నా పేరు సూర్య అంటూ బాక్సాఫీస్ మీద అల్లు అర్జున్ దాడి చేశాడు. కాన్సెప్ట్ భిన్నమైనది కావడంతో.. ఆశించిన స్థాయిలో పాజిటివ్ బజ్ లేదు కానీ.. బన్నీ యాక్టింగ్ పరంగా.. కంటెంట్ పరంగా.. విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. విపరీతమైన కోపిష్టి వ్యక్తికి అంతకు మించిన దేశభక్తి కలిగి ఉంటే.. ఎలా ఉంటుందనే అంశాన్ని బాగా చూపించాడు కొత్త దర్శకుడు వక్కంతం వంశీ. బన్నీ గత చిత్రాలకు ఇది పూర్తిగా భిన్నం. ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న వసూళ్ల పరంగా.. బన్నీ ట్రాక్ రికార్డ్ పరంగా చూస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం చాలా తేలిక అంటున్నారు.

ఒకవైపు స్టార్ హీరోలు ఇలా కొత్త కాన్సెప్టులతో ఇరగదీస్తుంటే.. విభిన్న చిత్రాలను అందించే నాని.. కమర్షియల్ మూవీ కృష్ణార్జున యుద్ధంతో ఫెయిల్ అయ్యాడు. వరుసగా 8 హిట్స్ సాధించిన నాని సినిమానే జనాలు తిప్పికొట్టారంటే.. తెలుగు ఆడియన్స్ కు కమర్షియల్ కంటెంట్ ఎంతగా మొహం మొత్తేసిందో అర్ధమవుతుంది.