Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ని ఇంటర్వ్యూ చేయబోతున్న స్టార్ డైరెక్టర్...?

By:  Tupaki Desk   |   4 Oct 2019 9:51 AM GMT
మెగాస్టార్ ని ఇంటర్వ్యూ చేయబోతున్న స్టార్ డైరెక్టర్...?
X
సైరా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా రిలీజ్ ముందు నుండి నిర్మాత రాంచరణ్, హీరో చిరంజీవి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా విడుదల అయ్యాక కూడా ప్రమోషన్స్ ఎక్కడా ఆపలేదు. ఇంకా చేస్తూనే ఉన్నారు. సినిమా కలెక్షన్స్ పెరగాలంటే ఇంకా ప్రమోషన్స్ పెంచాలని మూవీ టీమ్ అనుకుంటుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ తో చిరంజీవిని ఇంటర్వ్యూ చేయించాలని మూవీ టీమ్ భావిస్తుంది.

మెగాస్టార్ ఫ్యామిలీతో డైరెక్టర్ త్రివిక్రమ్ కి చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. అతను డైరెక్ట్ చేసిన సినిమాలలో చాలా సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ సినిమాలే ఉన్నాయి. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవిని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్ వస్తుంది. దీనితో త్రివిక్రమ్ కూడా ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకుంటారు. త్రివిక్రమ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తే అది సైరా మూవీకి తెలుగులో చాలా పెద్ద ప్లస్ అవుతుందని సైరా యూనిట్ అనుకుంటున్నారు.