Begin typing your search above and press return to search.

హిందీలో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ సైకో థ్రిల్లర్!

By:  Tupaki Desk   |   1 April 2021 1:30 AM GMT
హిందీలో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ సైకో థ్రిల్లర్!
X
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు మెయిన్ పాత్రలలో తెరకెక్కిన సైకో థ్రిల్లర్ మూవీ 'వి'. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేద థామస్, అతిథి రావు హైదరిలు నాయికలుగా నటించారు. ఈ థ్రిల్లర్ సినిమాలో నాని సైకో టైప్ విలనిజం నిండిన హీరో పాత్ర చేయడం విశేషం. ఈ సినిమాలో సుధీర్ బాబు సైకోను ఛాలెంజ్ చేసే పోలీస్ అధికారిగా కనిపించాడు. మొన్నటివరకు లాక్ డౌన్ కారణంగా జనాలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఓటిటిలే సినిమా థియేటర్లుగా అలరించాయి. చిన్నసినిమా, పెద్దసినిమా అనే తేడా లేకుండా సినిమాలన్నింటిని బేరం కుదుర్చుకొని ఓటిటిలో డిజిటల్ రిలీజ్ చేస్తూ వచ్చాయి.

ఐతే ఎన్నో అంచనాల మధ్య వి సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగుతో పాటు సౌత్ అన్ని భాషల్లో డబ్ వెర్షన్ రిలీజ్ అయింది. అలాగే అమెజాన్ లో మంచి వ్యూయర్ షిప్ కూడా సొంతం చేసుకుంది. ఐతే ఇప్పుడు వి సినిమా హిందీ డబ్ రిలీజ్ కు రంగం సిద్దమైంది. జనాలకు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఓటిటిలో మాత్రం మంచి వ్యూయర్ షిప్ అందుకుంది. ఐతే ఇప్పుడు వి సినిమాతో పాటు మరో సినిమా కూడా హిందీ డబ్ వెర్షన్ రిలీజ్ కాబోతుంది. అదే స్టార్ హీరో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమా కూడా గతేడాది ఓటిటిలో విడుదలై మంచి హిట్ అయింది. అలాగే దేశవ్యాప్తంగా ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వారు వి, ఆకాశం నీ హద్దురా సినిమాలను ఏప్రిల్ 4న హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చూడాలి మరి నార్త్ లో ఈ సినిమాలను ఎలా రిసీవ్ చేసుకుంటారో!