Begin typing your search above and press return to search.

నిర్మాతల్లో నిజాయితీ పాళ్లు ఎంత!!

By:  Tupaki Desk   |   8 Jun 2016 5:30 PM GMT
నిర్మాతల్లో నిజాయితీ పాళ్లు ఎంత!!
X
టాలీవుడ్ లో బడా నిర్మాతలకు ఏ మాత్రం కొదువ లేదు. కొత్తగా వచ్చే ప్రొడక్షన్ హౌజ్ లు కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అయితే.. చాలాసార్లు మూవీ రిలీజ్ కి ముందు ఐటీ వాళ్లు దాడులు చేశారనే వార్తలు వస్తాయ్ కానీ.. ఏం జరిగిందో మాత్రం ఎవరూ చెప్పరు. ఇటు నిర్మాతలు కానీ, అటు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కానీ క్లారిటీ ఇవ్వదు. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొంచెం లోతుల్లోకి వెళ్లాలి.

మన హీరోల్లో చాలామందికి ఛారిటీ సంస్థలు ఉన్నాయి. ఆదాయ పరిమితికి ఉన్న ఆస్తులను ఈ స్వచ్ఛంద సంస్థలకు తరలించడం ద్వారా పన్ను భారం నుంచి ఈజీగానే ఎస్కేప్ అవుతారు. నిర్మాతలు మాత్రం ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. ఏదైనా సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినా.. అంతలేసి లెక్కలు పేపర్లలో కనిపించవు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో కౌంటర్ల దగ్గర టికెట్ల లెక్కలకు.. డిజిటలైజేషన్ లేదు. దీంతో రిజిస్టర్ లో రాసిన మొత్తం మాత్రమే కౌంట్ అవుతుంది. ఇది సింగిల్ స్క్రీన్ లలో జరుగుతున్న వ్యవహారం.

ఓ అంచనా ప్రకారం అయిత్ 30 నుంచి 40 శాతం వరకూ కలెక్షన్లను తక్కువ చేసి చూపించడం ఆనవాయితీ. మిగిలిన మొత్తం బ్లాక్ మనీగా ప్రొడ్యూసర్ దగ్గరకు చేరుతుంది. ఈ నల్లడబ్బు నిర్మాతకు ఎందుకు అవసరం అంటే.. స్టార్స్ లో అందరూ తాము తీసుకునే రెమ్యూనరేషన్ లో సగం బ్లాక్ లోనే ఇవ్వాలని చెబుతారు. ఇక ఫారిన్ షూట్స్ వ్యవహారం అయితే అంతూపొంతూ ఉండదు. నోటికొచ్చినంత లెక్క చెప్పేసి.. సంపాదించుకున్నదేం లేదు మొర్రో అంటారు ప్రొడ్యూసర్లు. ఇలా డబ్బులొచ్చిన సినిమాకి కూడా.. కాకి లెక్కలతో మాయ చేయడం తప్పనిసరి అయిపోయింది అనే టాక్ వినిపిస్తోంది. అవునూ.. ఇందుకు కారణం స్టార్ హీరోలనే కారణం అనచ్చా!!