Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు...?
By: Tupaki Desk | 25 Jun 2020 12:00 PM ISTటాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి... ముందుగా ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.. ఏ స్టార్ హీరో మొదట మేకప్ వేసుకుంటాడు.. పెద్ద సినిమాల షూటింగ్స్ పరిస్థితి ఏంటి.. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. ఇప్పుడు సినీ అభిమానులు ఆలోచిస్తున్న విషయాలు ఇవి. నిజానికి అసలు టాలీవుడ్ లో సినిమా షూటింగ్ ల సందడి ఇప్పుడప్పుడే మొదలవుతుందా అనే ప్రశ్న వారి మనసుల్లో తలెత్తుతోంది. ఇప్పటి దాకా దీనికి సమాధానంగా ఆగస్ట్ అనే మాట వినిపించింది. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతించడంతో అర్థాంతరంగా ఆగిపోయిన సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయాలని భావించారు. అయితే కరోనా రోజురోజుకి విజృభిస్తుండటంతో ఎవరూ రిస్క్ తీసుకొని షూటింగ్ ప్రారంభించడానికి ముందుకు రాలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పడప్పుడే షూటింగ్స్ మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దీంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ క్రైసిస్ సమయంలో టాలీవుడ్ భవిష్యత్ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమావేశం ఏర్పాటు చేసి చర్చించారట. ఈ క్రమంలో కొందరు నిర్మాతలు ఆగస్ట్ నుంచి షూటింగ్స్ రెగ్యూలర్ గా స్టార్ట్ చేద్దాం అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారట. ఐతే మెజారిటీ నిర్మాతలు మాత్రం లైఫ్ రిస్క్ చేసి ఇప్పట్లో షూటింగ్స్ స్టార్ట్ చేయకపోతేనే మంచిదని చెప్పినట్లుగా సమాచారం. కాగా థియేటర్స్ ఎప్పడైతే సంపూర్ణంగా తెరుచుకుంటాయో అప్పుడే సినిమా ఇండస్ట్రీకి మళ్లీ మంచి రోజులు వస్తాయి.. అంతా బాగానే ఉంటే థియేటర్స్ ఎప్పుడో రీ ఓపెన్ చేసేవారు.. తెరవలేదంటనే విషయం తీవ్రతను అర్థం చేసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
దీనికి తోడు స్టార్ హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు ఎవ్వరూ కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు షూటింగ్స్ కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడానికి నటీనటులు సాహసం చేయాలని అనుకోవడం లేదు. అందుకే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మొత్తంగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ఇప్పుడే ప్రారంభమయ్యే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.