Begin typing your search above and press return to search.

సినీనిర్మాత‌ల 2550 కోట్ల భూమి గొడ‌వ‌!?

By:  Tupaki Desk   |   18 Nov 2018 5:10 AM GMT
సినీనిర్మాత‌ల 2550 కోట్ల భూమి గొడ‌వ‌!?
X
దాదాపు 50 ఎక‌రాల భూమి.. ఈ స్థ‌లం విలువే 1500 కోట్లు.. అంటే త‌ర‌త‌రాలు తిన్నా త‌ర‌గ‌నంత ఆస్తి. ఆ ఆస్తి మొత్తం నాది అని గ‌వ‌ర్న‌మెంట్ లాగేసుకుంటే..? లేదూ ఇది మా పిత్రార్జితం అని పూర్వీకుల పేరుతో ఒరిజిన‌ల్ డాక్యుమెంట్లు మా వ‌ద్ద‌నే ఉన్నాయి అని అస‌లు ప‌ట్టాదారు లేదా రైతులు వ‌చ్చి కేసులు వేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఆస్తిని ఎవ‌రైనా వ‌దులుకుంటారా? పైగా ఆరోజుల్లోనే బోలెడంత డ‌బ్బు పోసి కొనుక్కున్నామని భావిస్తున్న వీళ్లు వ‌దులుకుంటారా? అంటే.. అసంభ‌వం.. అలా జ‌రిగే ఛాన్సే లేదు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున‌.. ఎక‌రం 30కోట్లు ఖ‌రీదు ఉండే ప్రైమ్ ఏరియాలో ర‌గులుతున్న ర‌గ‌డ ఇది. బాహ్య ప్ర‌పంచానికి తెలిసీ తెలియ‌ని అవాక్క‌య్యే లాంటి గొడ‌వ ఇది!!

ఈ భూమి కోసం ఏళ్ల‌కు ఏళ్లుగా సివిల్ కోర్టుల్లో పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఓ సినీనిర్మాత‌. సారీ.. ఒక్క నిర్మాత కాదు.. ఆ 50 ఎక‌రాల‌కు మ‌రో 35 ఎక‌రాలు క‌లుపుకుంటే.. అందులో మ‌రో ఇద్ద‌రు సినీ నిర్మాత‌లు భాగ‌స్వాములు అయితే మొత్తం 85 ఎక‌రాల‌కు సంబంధించిన గొడ‌వ ఇది. ఓవ‌రాల్‌ గా సుమారు రూ.2550కోట్ల విలువ చేసే భూమికి సంబంధించిన అతి పెద్ద‌ వివాదం ఇది. ఇప్ప‌టికే ప‌లుమార్లు డాక్యుమెంట్లు చేతులు మార‌డంతో పెద్ద చిక్కొచ్చి ప‌డింద‌ని, స్థ‌లం మాది అంటే మాది అన్న గొడ‌వ సాగుతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో వివాదం న‌డుస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాలకు వెళుతున్నారు ఆ ముగ్గురూ. ఇటీవ‌లే ఈ భూమికి సంబంధించి విచార‌ణ‌లో కోర్టు ఓ పెద్ద మెలిక పెట్ట‌డంతో స‌ద‌రు నిర్మాత‌లు టెన్ష‌న్ టెన్ష‌న్‌ లో ఉన్నార‌ట‌. అస‌లింత‌కీ ఏమైంది? అంటే.. ఇన్నాళ్లు ఆ భూమి త‌మ‌ది .. వేరే రైతుల నుంచి కొనుక్కున్నాం క‌దా! అన్న ధీమాతో ఉన్న వాళ్ల‌కు ఝ‌లక్‌ ని ఇస్తూ ఇది ఎవ‌రిదీ కాదు.. ఈ భూమి ప్ర‌భుత్వానిది అంటూ కోర్టు పెద్ద షాకిచ్చిందిట‌. దీంతో ఆ టెన్ష‌న్‌ లో నిద్రాహారాలు మాని స‌ద‌రు నిర్మాత‌లు రేయింబ‌వ‌ళ్లు ఆందోళ‌న‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. మొత్తానికి ఆ భూమి గొడ‌వ తేల్చుకోవ‌డ‌మే 50 ఎక‌రాల నిర్మాత జీవితాశ‌యం అని తెలుస్తోంది.

10 ఎక‌రాలు - 15 ఎక‌రాల భూమి 50 ఎక‌రాల్ని ఆనుకుని ఉంది. ఆ ఇద్ద‌రు నిర్మాత‌ల్లోనూ కోర్టు కేసుల‌ టెన్ష‌న్ త‌క్కువేమీ కాదట‌. 10 ఎక‌రాలు అంటే 300కోట్లు... 15 ఎక‌రాలు అంటే 450 కోట్లు క‌దా! అందుకే ప్ర‌స్తుతం టెన్ష‌న్‌ తో చెమ‌ట‌లు ప‌ట్టి త‌డిసిపోతున్నాయిట‌. అయితే ఇదింకా కోర్టు కేసు తేల‌లేదు కాబ‌ట్టి.. ఈ వివాదం గురించి బ‌హిరంగంగా మీడియాలో ప్ర‌స్థావించ‌నూ లేదు. ఇంత‌కీ ఈ ఎపిసోడ్‌ లో స‌ద‌రు నిర్మాత‌లెవ‌రు? అన్న‌ది అప్ర‌స్తుతం. ప్ర‌స్తుతానికి అంతా టెన్ష‌న్ టెన్ష‌న్! ఇది ప‌క్కా అని తెలుస్తోంది!! ఈ టాప్ సీక్రెట్‌ కోర్టు వ‌ర్గాల ద్వారా క్లోజ్ సోర్సెస్ నుంచి లీకైంది. ఈ ఎపిసోడ్‌ లో బ‌డా సినీనిర్మాత‌లు ఎవ‌రు? ఇంత‌కీ హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఆ స్థ‌లం ఎక్క‌డుంది? అన్న వివ‌రాలు త‌ర్వాత ఆర్టిక‌ల్‌ లో ...!!