Begin typing your search above and press return to search.
బటర్ ఫ్లై ఎఫెక్ట్: పీఆర్వో లకు ఎసరు!
By: Tupaki Desk | 10 May 2020 5:00 PM ISTఎక్కడో స్విచ్ వేస్తే లైట్ మరెక్కడో వెలుగుతుంది. అలాగే ఒక్కోసారి ఎక్కడో ఏదో జరిగితే దాని ప్రభావం మరెక్కడో కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ మొదలుపెట్టిన ఫేక్ న్యూస్ ను అరికట్టే కాంపెయిన్ అటు ఇటు తిరిగి పీఆర్ ఓ ల మెడకు చుట్టుకునేలా ఉందని టాక్ వినిపిస్తోంది. అసలు పీఆర్ఓ వ్యవస్థను పూర్తిగా తీసేసి నిర్మాతల మండలి తరఫున ఒక టీమ్ ను ఏర్పాటు చేసి కథ నడిపించాలని సినీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. దీనికి ప్రధాన కారణం కొంత మంది పీఆర్ ఓ లు అన్ని వెబ్ సైట్స్ ని ఈక్వల్ గా చూడకుండా కొందరిని నెత్తిన పెట్టుకుని వాళ్ళకే మొదటగా న్యూస్ లు చెప్పటం... గాసిప్స్ చేరవేయటం వంటివి ఎక్కువ అయ్యాయి అంట.. ఇలాంటి వారిని కట్టడి చేసి అందరినీ ఈక్వల్ గా చూస్తే ఇలాంటి ఇష్యూస్ రావు అని పెద్దలు అనుకుంటున్నారు అంట..
పీఆర్ఓ లు అనే ప్రస్తావనే లేకుండా ఈ టీమ్ ద్వారానే మీడియాను హ్యాండిల్ చేసే దిశగా ప్లానింగ్ సాగుతోందట. నిజానికి హీరోలు.. చిత్ర బృందం ఏం చెప్తే అది చేసుకుంటూ పోతుంటారు ఎక్కువమంది పీఆర్ ఓలు. అటు మీడియాకు ఇటు సినిమాకు వారధిలాగా వ్యవహరిస్తుంటారు. ఇప్పటికే పీఆర్ ఓలు సినిమాలకు పని చేసినప్పుడు మొత్తం రెమ్యూనరేషన్ ఇవ్వరని ఒక టాక్ ఉంది. వారు రొటేషన్ పద్ధతిలో వ్యవహారం నడిపిస్తూ ఉంటారట.
మీడియాను కంట్రోల్ చెయ్యాలని వీరికి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఒకరితో ఒకరు పోటీ పడేలా చేసేది సినిమావాళ్లేనని.. వారి లాభానికి పావులా వాడుకుంటూనే ఉన్నారని.. ఇప్పుడు ఫేక్ న్యూస్ వ్యవహారంలో అంతా రివర్స్ అయ్యేసరికి అసలు పీఆర్ ఓలు వద్దే వద్దని ఒక కొత్త రూల్ తీసుకురావాలని అంటున్నారట. అసలు పీఆర్ ఓలు లేకపోతే సినిమాల మార్కెటింగ్ ఎలా అవుతుంది? అనేది మాత్రం ఎవరూ ఆలోచించడం లేదని అంటున్నారు.