Begin typing your search above and press return to search.

మన నిర్మాతల సమావేశంలో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   12 July 2017 9:52 AM IST
మన నిర్మాతల సమావేశంలో ఏం జరిగింది?
X
రీసెంట్ గా టాలీవుడ్ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. తాజాగా ఎగ్జిబటర్లు పాల్పడుతున్న ఓ భారీ స్కామ్ నకు సంబంధించి చర్చించేందుకే ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ భేటీలో దాదాపు 80 మంది నిర్మాతలు పాల్గొనగా.. ఒక భారీ ప్రొడ్యూసర్ టార్గెట్ అయిపోయినట్లుగా చెబుతున్నారు. పదండి అసలు ఏం జరిగిందో చూద్దాం.

నిర్మాణంతో పాటు ఎగ్జిబిషన్ విభాగంలో కూడా ఓ బడా నిర్మాతకు.. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 600లకుపైగా థియేటర్లకు సంబంధించి లీజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఈయన నిర్మాతల కష్టాలను పట్టించుకోకుండా.. ఎగ్జిబిటర్ల తరఫున వాదించడమే మీటింగ్ లో రగడకు అసలు కారణంగా తెలుస్తోంది. 800 మంది నిర్మాతలు ఉన్న మండలి సభ్యుడిగా ఉంటూ..వారి ప్రయోజనాల కోసం కాకుండా.. ఎగ్జిబిటర్ల తరఫున మాటలు వినిపించడం జరగిందట. నిర్మాతగా కాకుండా.. లీజుదారుడిగానే ఈయన ఎక్కువ సంపాదిస్తున్నాడని అనేందుకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదంటున్నారు ఇతర నిర్మాతలు.

తెలంగాణ ప్రభుత్వం థియేటర్ నిర్వహణ ఖర్చులుగా.. 7 రూపాయలు చొప్పున వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం దగ్గర.. నిర్మాతలు- ఎగ్జిబిటర్ల మధ్య ఈ వివాదం మొదలైంది. ఇప్పటికే లీజుదారుడైన ఈ నిర్మాత.. ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడని.. ఇకపై ఈయన ఆగడాలను తాము సహించే పరిస్థితి లేదంటూ.. తీవ్రంగానే చెబుతున్నారు నిర్మాతల మండలి సభ్యలు. టికెట్ ధరల పెరుగదల ద్వారా వచ్చే అదనపు డబ్బులు నిర్మాతలకు చేరేవరకూ తాము పోరాటం చేస్తామని ఒక నిర్మాత రామసత్యన్నారాయణ ఓపెన్ గా చెప్పేశారు.