Begin typing your search above and press return to search.
ప్రియా వారియర్ తెలుగులోకి వచ్చేస్తోందా?
By: Tupaki Desk | 31 March 2018 12:02 PM IST అనుకున్న దాని కంటే ముందే కన్నుగీటు సుందరి ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్ ఎంట్రీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించని రేంజ్ లో జస్ట్ ఒక టీజర్ తో దేశం మొత్తం సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ప్రియా వారియర్ ని తమ సినిమాల ద్వారా పరిచయం చేసేందుకు వివిధ బాషల్లో గట్టి ప్రయత్నాలే జరిగాయి . కాని ఒరు ఆదార్ లవ్ విడుదల అయ్యే వరకు కొత్తవాటి గురించి ఆలోచించనని చెప్పిన ప్రియా ఇప్పుడు ఆ నిబంధన సడలించినట్టు టాక్. కారణం తనకు వచ్చిన ఒక భారీ టాలీవుడ్ ఆఫర్ అని విశ్వసనీయ సమాచారం. ఈగో అనే పేరుతో సుమారు ఓ నెల రోజుల క్రితం విడుదలైన సినిమా ద్వారా పరిచయమైన ఆశిష్ రాజ్ హీరోగా రూపొందే ఒరు ఆదార్ లవ్ తెలుగు రీమేక్ లో నటించేందుకు ప్రియా వారియర్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్త టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. పెద్ద నిర్మాతలు అడిగినా ఆలోచిస్తాను అని చెప్పిన ప్రియా కొత్త హీరో సరసన ఒప్పుకోవడం ఆశ్చర్యమే.
ఇది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒరు ఆదార్ లవ్ రీమేకే కనక వేరే సినిమాల్లో ఇప్పట్లో నటించకూడదు అనే కండిషన్ రాయించుకున్న ఒరిజినల్ దర్శకుడు ఒమర్ లుల్లు ఒపుకుని ఉండవచ్చని తెలిసింది. మరి తెలుగు వెర్షన్ ని అతనే డైరెక్ట్ చేస్తాడా లేక వేరే ఎవరైనా టేకప్ చేస్తారా అనే అప్ డేట్ ఇంకా బయటికి రాలేదు. ఇది నిజమైన పక్షంలో ప్రియా వారియర్ కు బంపర్ ఆఫర్ తగిలినట్టే. సినిమా కనక హిట్ అయ్యిందా టాలీవుడ్ లో అవకాశాలతో ముంచెత్తుతారు. త్వరగా టాప్ లీగ్ లో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కేరళ నుంచే వచ్చిన సాయి పల్లవి-అనుపమ పరమేశ్వరన్-నివేదా థామస్ ఒకటి రెండు సినిమాలతోనే తామెంటో ప్రూవ్ చేసుకుని మంచి డిమాండ్ లో ఉన్నారు. ప్రియా వారియర్ కు కూడా ఇలాగే టైం కలిసి వచ్చిందో అవకాశాల కోసం వేరే బాషల వైపు వెళ్ళనక్కర్లేదు. మరి తన స్టార్ ఎలా ఉందో వేచి చూడాలి.