Begin typing your search above and press return to search.

మురుగ‌దాస్ తో టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మీట్!

By:  Tupaki Desk   |   9 Aug 2022 2:30 PM GMT
మురుగ‌దాస్ తో టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మీట్!
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు భారీ ప్రాజెక్ట్ లు దిశ‌గా అడుగులు వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో సినిమాలు నిర్మించిన న‌యా నిర్మాత కంటెంట్ ప‌రంగానూ భారీ బ‌డ్జెట్ చిత్రాల నిర్మాణం వైపు క‌దులుతున్నారు. ఇప్ప‌టికే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా 170 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. దిల్ రాజు కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. ఈ బ‌డ్జెట్ ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ ఒక్క‌టే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి నిర్మిస్తుంది. 170 కోట్ల బ‌డ్జెట్ అనేది అధికారిక స‌మాచారం. అన‌ధికారికంగా శంక‌ర్ ఈ సినిమా పూర్తిచేయ‌డానికి ఎంత ఖ‌ర్చు అవుతుందో? సినిమా పూర్త‌యితే గానీ తెలియ‌దు. ఇలా అన్ని లెక్క‌లు బేరీజు వేసుకునే రాజుగారు రంగంలోకి దిగారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా దిల్ రాజు మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ని చెన్నైలో క‌ల‌వ‌డం ఇండ‌స్ర్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌లే దిల్ రాజు - ముర‌గ‌దాస్ తో స‌మాశ‌మ‌య్యారుట‌. ఈ మీట్ సినిమాకి సంబంధించిందా? క్యాజువ‌ల్ గా క‌లిసారా? అన్న‌ది క్లారిటీ లేదు గానీ...రాజుగారు-ముర‌గ‌దాస్ క‌ల‌యిక ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

అటు ముర‌గ‌దాస్ సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. 'ద‌ర్బార్' త‌ర్వాత ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. విజ‌య్ తో సినిమా చేద్దాం అనుకున్నా కుద‌ర‌లేదు. ఈ నేప‌థ్యంలో అదే క‌థ‌ని శింబుతో తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. అది ఇంత వ‌ర‌కూ కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజా రాజుగారు మురుగ‌దాస్ తో ఏదైనా భారీ బ‌డ్జెట్ చిత్రం ప్లాన్ చేస్తున్నారా? అన్న సందేహం మొద‌లైంది.

ఇటీవ‌లి కాలంలో రాజుగారి ఆలోచ‌న దృక్ఫ‌థంలో వ‌చ్చిన మార్పులే ఈ సందేశాల‌కి తావిస్తున్నాయి. మురుగ‌దాస్ స‌క్సెస్ ఫుల్ ట్రాక్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో పాటు చ‌క్క‌ని సందేశాన్ని అందించ‌డం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లింది. కోలీవుడ్ హీరోలంద‌రికీ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించారు. అటు పై టాలీవుడ్ లో లాంచ్ అయి 'స్టాలిన్' తో మెగాస్టార్ చిరంజీవికి ఓ స‌క్సెస్ ఇచ్చారు. 'స్పైడ‌ర్' తో మ‌హేష్ కి సైతం అలాంటి స‌క్సెస్ అందించాల‌ని భావించారు.

కానీ వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. ఇప్పుడు కోలీవుడ్ అంతా టాలీవుడ్ వైపు చూస్తోన్న త‌రుణ‌మిది. మ‌రి రాజుగారు -మురుగ‌దాస్ ని క‌లిసిన వేళ! మ‌ళ్లీ తెలుగు సినిమా కోసం ముర‌గ‌ని ఇటువైపు ర‌ప్పించే ప్ర‌య‌త్నమా? అన్న సందేహం ప‌రిశ్ర‌మ స‌హా అభిమానుల్లో మొద‌లైంది. అదే నిజ‌మైతే? రాజుగారి స్పాన్ అంత‌కంత‌కు పెరుగుతున్న‌ట్లే.