Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత గుట్టు బయటపడిపోయిందిగా..

By:  Tupaki Desk   |   3 Aug 2017 9:36 AM GMT
ఆ నిర్మాత గుట్టు బయటపడిపోయిందిగా..
X
ఆ హీరో ఒక నిర్మాత కొడుకు. ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో టాలీవుడ్లోకి ఘనంగా అరంగేట్రం చేశాడు. ఐతే అతడి తొలి సినిమాకు తండ్రే నిర్మాత. ఆ హీరో బ్యాగ్రౌండ్ ప్రకారం చూస్తే.. తండ్రి నిర్మాణంలోనే ఇంకొన్ని సినిమాలు చేయక తప్పని పరిస్థితి ఉంటుందనుకున్నారు. కానీ రెండో సినిమా నుంచి బయటి బేనర్లలోనే చేస్తున్నాడా హీరో. ఆ హీరో మీద కొంచెం భారీగానే పెట్టుబడి పెట్టి సినిమాలు చేస్తున్నారు బయటి నిర్మాతలు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ కొత్త నిర్మాత ఆ హీరోను పెట్టి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించాడు. ఈ సినిమా చాలా రిచ్ గా తెరకెక్కింది. ఆ హీరో మీద అంత పెట్టుబడి పెట్టడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఈ హీరో సినిమాలకు తెర వెనుక ఉండి అతడి తండ్రే పెట్టుబడి పెడుతున్నాడన్నది చాలామందికి సందేహం.

తాజాగా ఈ సందేహాన్ని బలపరిచే పరిణామం ఒకటి జరిగింది. ఈ సినిమాకు సంబంధించి చిన్న వివాదం తలెత్తితే హీరో తండ్రి జోక్యం చేసుకున్నాడు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. కానీ హీరో తండ్రే దాన్ని డీల్ చేశాడు. అది పేమెంట్లకు సంబంధించిన వివాదం కావడం విశేషం. అది నిజానికి ఆ చిత్ర నిర్మాత చూసుకోవాల్సిన వ్యవహారం. కానీ హీరో తండ్రి డీల్ చేశాడంటే.. దీన్ని బట్టి ఆ సినిమా ప్రొడక్షన్లో ఆయన పాత్ర కీలకమని అర్థం చేసుకోవచ్చు. ఆ హీరో ప్రస్తుతం ఇంకో పెద్ద దర్శకుడితో ఓ పెద్ద బేనర్లో సినిమా చేస్తున్నాడు. అది కూడా భారీ బడ్జెట్ మూవీనే. దీని వెనుక కూడా ఆ హీరో తండ్రి ఉన్నాడని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కొన్ని ఫైనాన్స్.. ఇతర వివాదాల వల్ల సినిమాలు చేయడం మానేసిన ఆ నిర్మాత.. ఇలా మరో మార్గంలో కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన సెట్ చేస్తున్న కాంబినేసన్లు.. కొడుకు సినిమాల్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న తీరు మాత్రం టాలీవుడ్లో బడా బడా ఫ్యామిలీల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.