Begin typing your search above and press return to search.

పెద్దనోట్ల రద్దు తర్వాతా ఆ నిర్మాత ఫుల్ ఖుషీనట

By:  Tupaki Desk   |   12 Nov 2016 4:36 PM GMT
పెద్దనోట్ల రద్దు తర్వాతా ఆ నిర్మాత ఫుల్ ఖుషీనట
X
టాలీవుడ్ లో చాలామంది నిర్మాతలు ఉన్నా.. ఒకరిద్దరు నిర్మాతలకు గ్లామరే వేరు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. మధ్యలో కాస్త స్పీడ్ తగ్గించి.. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయినా.. అయన పేరుకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. అలాంటి ఆయన ఇప్పుడు చాలా ఖుషీగా ఉన్నాడట. మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు కిందామీదా పడుతున్న పరిస్థితి.

మిగిలిన వారికి భిన్నంగా సదరు నిర్మాత మాత్రం.. ఏమాత్రం కంగారు పడకుండా తాను హ్యాండ్ లోన్ తీసుకొచ్చిన వారందరినీ పిలిచి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత మొత్తాన్ని ఇచ్చేశాడట. అంతేకాదు.. తాను పెండింగ్ పెట్టిన బిల్లులు మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారట. దీంతో.. చేతిలో ఉన్న పెద్ద నోట్లు మొత్తం అయిపోయాయట. దీంతో.. రోజువారీ ఖర్చుల సంగతి చూసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది. ఇప్పుడాయన చేస్తున్న రెండు సినిమా షూటింగ్ లు నడుస్తున్నా.. ఆయనమాత్రంఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నారట. పెద్ద నోట్ల రద్దుతో అందరూ హైరానా పడుతుంటే.. తెలివిగా వ్యవహరించిన ఆయన మాత్రం దిల్ ఖుష్ గా ఉన్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/